Share News

YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం

ABN , Publish Date - May 01 , 2025 | 08:58 AM

YS Jagan: ఏపీ రాజధాని అమరావతి రీ లాంచ్ పనులను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకోసం మే2వ తేదీన ముహుర్తాన్ని నిర్ణయించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆహ్వానం పంపించింది. అలాగే పలువురు ప్రముఖులను ఈ కార్యక్రమం కోసం రావాలని ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలోనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా కూటమి ప్రభుత్వ ఆహ్వానం పంపించింది.

YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం
YS Jagan invited to Amaravati Re Launch Development works

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) రీ లాంచ్ పనులకు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి (YS Jagan) కూటమి ప్రభుత్వ ఆహ్వానం పంపించింది. అమరావతి రీ లాంచ్ పనుల ప్రారంభోత్సవం కోసం మే2వ తేదీన ముహుర్తం నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతి పనులను కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతోంది.


ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతులమీదుగా ఈ పనులను ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం సంకల్పిచింది. ఇందులో భాగంగానే మే 2వ తేదీన జరుగనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు హాజరు కావాలని జగన్మోహన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఆహ్వానపత్రికను పంపించింది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లి ప్రొటోకాల్ అధికారులు ఆహ్వాన పత్రిక అందజేశారు. నిన్న(బుధవారం) సాయంత్రం జగన్ ఇంటి దగ్గర లేకపోవడంతో ఆయన పీఏ కే. నాగేశ్వరరెడ్డికి ఆహ్వాన పత్రికను ప్రోటోకాల్ అధికారులు అందించారు. గతంలో కూడా అమరావతి ప్రారంభోత్సవానికి చంద్రబాబు ప్రభుత్వం ఆహ్వానం పంపించిన జగన్ మాత్రం రాలేదు. అయితే రేపటి కార్యక్రమానికి జగన్ వస్తారా రారా అనే విషయం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మూడు రాజధానులను ప్రకటించిన విషయం తెలిసిందే.


కాగా ప్రభుత్వం అమరావతి రాజధాని పనులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ మేరకు చర్యలు చేపట్టింది. రాజధాని అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మే 2వ తేదీన పర్యటించనున్నారు. అమరావతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభింస్తారు. మోదీ పర్యటన సందర్భంగా ఏపీ ప్రభత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఈ ఏర్పాట్లను దగ్గరుండి మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు మంత్రి నారాయణ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే ప్రధాని సభకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తి అయినట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..

పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్‌ ఖర్చు తక్కువ

For More AP News and Telugu News

Updated Date - May 01 , 2025 | 09:22 AM