Share News

Pahalgam: పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

ABN , Publish Date - May 01 , 2025 | 06:02 AM

పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్య సమితి ఖండించింది, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసింది. జైశంకర్‌, షరీఫ్‌తో విడివిడిగా మాట్లాడిన గుటెర్రస్‌, సంఘర్షణలు నివారించాల్సిన అవసరం ఉందన్నారు.

Pahalgam: పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి

జైశంకర్‌కు, పాక్‌ ప్రధానికి ఫోన్‌

న్యూడిల్లీ, ఏప్రిల్‌ 30: పహల్గాం ఉగ్రదాడితో ఉద్రికత్తతలు పెరుగుతున్న వేళ ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది. భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌తో పాటు పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీ్‌ఫతో యూఎన్‌ సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెర్రస్‌ మంగళవారం వేర్వేరుగా ఫోన్‌లో మాట్లాడారు. ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. భారత్‌-పాక్‌ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేశారు. విషాదకర పరిణామాలకు దారితీసే ఘర్షణను నివారించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. కాగా, ఈ మారణకాండకు పాల్పడిన వారితో పాటు దీనికి కుట్రదారులు, మద్దతుదారులను కఠినంగా శిక్షించాలని భారత్‌ కృతనిశ్చయంతో ఉందని ఆయనకు వివరించినట్లు జైశంకర్‌ ఓ పోస్టులో తెలిపారు. కాగా, పహల్గాం ఘటనపై పారదర్శకమైన, తటస్థ దర్యాప్తు కోసం విజ్ఞప్తి చేశానని షరీప్‌ తెలిపారు. ఇదిలా ఉండగా, ఉగ్రదాడిపై అల్జీరియా, గ్రీస్‌, సియెర్రా లియోన్‌, గయానా, స్లొవేనియా, సోమాలియా, పనామా దేశాల విదేశాంగ మంత్రులతో జైశంకర్‌ చర్చించారు. పహల్గాం ఉగ్రదాడిని ఖండించడంతో పాటు భారత్‌కు సంఘీభావం తెలిపినందుకు ఆయా దేశాలకు జైశంకర్‌ కృతజ్ఞతలు తెలిపారు.


Also Read:

BR Ambedkar: అంబేడ్కర్, అఖిలేష్‌ చెరిసగం ఫోటో .. విమర్శలు గుప్పించిన బీజేపీ

Fish Viral Video: ప్రయత్నాలు ఎప్పుడూ వృథా కావు.. ఈ చేప ఏం చేసిందో చూస్తే..

Haunted Tours: ఆశ్చర్యం కాదు..దెయ్యాల రాష్ట్రాల గురించి తెలుసా మీకు..

Updated Date - May 01 , 2025 | 06:02 AM