ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TTD: గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ చేస్తారా.. భానుప్రకాష్ రెడ్డి ఫైర్

ABN, Publish Date - May 15 , 2025 | 11:28 AM

Srivari Govinda Namalu: తిరుమల వేంకటేశ్వర స్వామిని భక్తులు ఎంతోమంది దర్శించుకుంటారు. శ్రీవారిని ఇష్టదైవంగా పలువురు కొలుస్తారు. వేంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. ఈ నామాలను అభ్యంతరకరంగా ఓ చిత్రంలో వాడుకోవడంపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని టీటీడీ ఇప్పుడు సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టింది.

Srivari Govinda Namalu

తిరుమల: డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్రంలో శ్రీవారి గోవింద నామాలను అభ్యంతరకరంగా వాడారని టీటీడీ సభ్యులు, అధికారుల దృష్టికి రావడంతో వారు సీరియస్ అయ్యారు. శ్రీవారి గోవింద నామాలను అభ్యంతరకరంగా వాడుకున్న ఆ చిత్ర బృందంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డీడీ నెక్స్ట్ లెవెల్ చిత్ర బృందానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. శ్రీవారి గోవింద నామాలకు పెటేంట్ హక్కులు తీసుకునే విధంగా రాబోవు బోర్డు సమావేశంలో తీర్మానం చేస్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు.


స్వామి వారి గోవింద నామాలతో ర్యాప్ సాంగ్ చేయడం దారుణమని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఇవాళ(గురువారం) తిరుమలలో భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. హిందూ భక్తుడిగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా ఆ చిత్ర బృందాన్ని తాను ప్రశ్నిస్తున్నానని చెప్పారు. దమ్ముంటే ఇప్పుడు తిరుమలకు రండి.. అలిపిరి వద్దే స్వామి వారీ భక్తులంటే ఏంటో గా ఆ చిత్ర బృందానికి చూపిస్తామని హెచ్చరించారు. తమిళనాడులోని భక్తులంతా ఆ చిత్ర బృందంపై దాడి చేయాలని అన్నారు. చిత్ర బృందం వెంటనే భక్తులకు క్షమాపణ చెప్పి..పాటను తొలగించాలని డిమాండ్ చేశారు. భక్తులకు క్షమాపణ చెప్పకుండా చిత్ర బృందంలోని ఎవరైనా తిరుమలకు వస్తే.. అలిపిరి వద్దే వారికి తగ్గిన బుద్ది చెబుతామని వార్నింగ్ ఇచ్చారు. సెన్సార్ బోర్డుపై కూడా క్రిమినల్ కేసు పెడతానని భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Minister Lokesh: అనంతపురంలో మంత్రి నారా లోకేష్ పర్యటన

AP News: జగన్ రెడ్డికి కూటమి ప్రభుత్వం ఝలక్.. ఎందుకంటే..

AP News: సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

సామర్లకోట మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం

బెజవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే పట్టు చీర బహుకరణ

For More AP News and Telugu News

Updated Date - May 15 , 2025 | 11:37 AM