Share News

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (21/01/2026)

ABN , First Publish Date - Jan 21 , 2026 | 06:13 AM

ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి..

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్.. (21/01/2026)

Live News & Updates

  • Jan 21, 2026 21:13 IST

    న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..

    • తొలి టీ20 మ్యాచ్‌లో‌ 238 పరుగులు చేసిన భారత్.

    • న్యూజిలాండ్ టార్గెట్ 239 పరుగులు.

    • పూర్తికథనం

  • Jan 21, 2026 20:58 IST

    దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు విడుదల..

    • రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేసిన ప్రభుత్వం.

    • 3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.53.05 కోట్లు విడుదల.

    • 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.7.16 కోట్లు విడుదల.

      పూర్తికథనం..

  • Jan 21, 2026 20:19 IST

    దావోస్‌: యూరప్‌ సరైన దిశలో వెళ్లడం లేదు: ట్రంప్‌

    • నా పాలనను చూసి యూరప్‌ నేర్చుకోవాలి.

    • అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించాం.

      పూర్తికథనం

  • Jan 21, 2026 18:55 IST

    ఏక్‌నాథ్ షిండే‌పై సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు..

    • షిండే మేయర్ పోస్ట్ కోసం ఢిల్లీ వెళ్లి గుజరాతీ లీడర్ల కాళ్లపై పడాల్సి ఉంటుంది.

      పూర్తికథనం..

  • Jan 21, 2026 18:28 IST

    తెలంగాణలో 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ..

    • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.

    • తక్షణమే విధుల్లో చేరాలని అధికారులకు ఆదేశాలు.

      పూర్తికథనం

  • Jan 21, 2026 18:26 IST

    ఆరావళి పర్వత శ్రేణుల్లో అక్రమ మైనింగ్‌పై నిపుణుల కమిటీ

    • ఆరావళి పర్వతాల్లో అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం.

    • నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం.

      పూర్తికథనం

  • Jan 21, 2026 17:55 IST

    గణతంత్ర దినోత్సవాన్ని లక్ష్యంగా చేసుకుని భారత్‌లో ఉగ్రదాడులకు కుట్ర.

    • భద్రతా బలగాలను అప్రమత్తం చేసిన నిఘా వర్గాలు.

    • ఉగ్రకుట్రకు '26-26' అనే కోడ్ నేమ్ పెట్టినట్టు సమాచారం.

      పూర్తికథనం..

  • Jan 21, 2026 17:27 IST

    మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ సిద్ధం: కేటీఆర్

    • మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్, నేను ప్రచారం చేయం.

    • పంచాయతీ ఎన్నికల్లో 40శాతం సర్పంచ్‌ స్థానాలను గెలిచాం.

    • మున్సిపల్ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు గెలుస్తాం.

      పూర్తికథనం

  • Jan 21, 2026 16:46 IST

    ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం..

    • కేబినెట్‌ ఆమోదం తర్వాత.. పార్లమెంట్‌లో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు సమాచారం.

    • 2024 జూన్‌ 2తో ముగిసిన ఉమ్మడి రాజధాని గడువు.

    • ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి.

    • పూర్తికథనం

  • Jan 21, 2026 16:37 IST

    దావోస్‌లో జాతీయ, అంతర్జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు ఇష్టాగోష్టి

    • ఏపీలో పారిశ్రామికాభివృద్ధి, ప్రభుత్వ పాలసీలను వివరించిన చంద్రబాబు.

    • ఏ రాష్ట్రానికైనా బ్రాండింగ్‌ ఉంటేనే పెట్టుబడులు.

    • చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధించగలం.

      పూర్తికథనం

  • Jan 21, 2026 16:35 IST

    మెదక్: నర్సాపూర్‌ మండలం చాకరిమెట్లలో యువకుడు ధన్‌సింగ్‌పై దాడి

    • కంది మండలం బ్యాతోల్‌కు చెందిన యువతితో ప్రేమ.

    • ధన్‌సింగ్‌ను కారులో అడివిలోకి తీసుకెళ్లి హత్యాయత్నం.

    • నర్సాపూర్‌ పీఎస్‌లో యువకుడి బంధువులు ఫిర్యాదు, కేసు నమోదు.

      పూర్తికథనం..

  • Jan 21, 2026 16:32 IST

    ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి విలువ.

  • Jan 21, 2026 15:33 IST

    దావోస్: సీఎం రేవంత్‌రెడ్డితో సర్గడ్ సంస్థ సీఈవో భేటీ.

    • తెలంగాణలో మెయింటెనెన్స్ అండ్ రిపేర్ యూనిట్ ఏర్పాటు.

    • రాబోయే ఐదేళ్లలో రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులకు MoU.

      పూర్తికథనం

  • Jan 21, 2026 15:24 IST

    విరాట్‌పై మహ్మద్ కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..

    Virat Kohli

    • కోహ్లీ ఫిట్‌నెస్, క్రికెట్‌పై అతడి అంకితభావం, స్వీయ సన్నద్ధత అమోఘం.

    • విరాట్ ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదు.

    • కొత్తగా తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం కూడా లేదు.

    • రెగ్యులర్‌గా ఆడకపోయినా.. ఇలా నిలకడగా పరుగులు రాబట్టడం అంత తేలికైన విషయం కాదు.

      పూర్తికథనం

  • Jan 21, 2026 15:13 IST

    కాకినాడ: టీడీపీ నేత బంగారయ్య హత్యకేసును ఛేదించిన పోలీసులు.

    • ప్రధాన నిందితుడు వైసీపీ నేత చినబాబు సహా 12 మంది అరెస్ట్.

    • నిందితులను ప్రజలందరూ చూసేలా రోడ్డుపై నడిపించిన తుని పోలీసులు.

    • ఈనెల 16న అల్లిపూడిలో టీడీపీ నేత బంగారయ్య హత్య.

      పూర్తికథనం

  • Jan 21, 2026 15:10 IST

    వీధి కుక్కల హత్య.. యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు..

    Untitled-49.jpg

    • రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో దారుణం.

    • గ్రామ పంచాయితీ పరిధిలో వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపిన వైనం.

    • స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.

      పూర్తికథనం

  • Jan 21, 2026 14:47 IST

    నల్లమలలో పులుల గణన..

    zzzzzzzzzzzzz.jpg

    • నల్లమల రిజర్వ్ ఫారెస్టులో పులుల గణన ప్రారంభించారు.

    • మహబూబ్‏నగర్ జిల్లాలోని అమ్రాబాద్‌ రేంజ్‌ పరిధిలోని ఈర్లపడేలు అటవీ ప్రాంతం నుంచి పులుల గణన ప్రారంభమైంది.

    • అటవీ సిబ్బందితోపాటు వాలంటీర్లు ఈ పులుల గణనలో పాల్గొంటున్నారు.

      పూర్తికథనం

  • Jan 21, 2026 14:10 IST

    తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ఎన్డీయేలోకి టీటీవీ దినకరన్

    • తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది..

    • 'అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం' చీఫ్ టీటీవీ దినకరన్.. కీలక నిర్ణయం..

    • ఎన్డీయే కూటమిలో చేరిన దినకరన్..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 14:02 IST

    మందుల చీటీ తారుమారు.. చివరికి ఏమైందంటే..

    • కామారెడ్డి పట్టణంలోని ఆస్పత్రిలో విషాద ఘటన..

    • ఒకే పేరున్న ఇద్దరు రోగుల విషయంలో వైద్యుడు చేసిన పొరపాటు..

    • మందుల చీటీ తారుమారు కావడం వల్ల రోగి మృతి..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:53 IST

    ఆన్‌లైన్ గేమ్స్‌తో అప్పులపాలు.. యువకుడి ఆత్మహత్య..

    • హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో విషాద ఘటన..

    • ఆన్‌లైన్ గేమ్స్, బెట్టింగ్‌ల వ్యసనానికి బానిసైన యువకుడు..

    • అప్పుల ఊబిలో కూరుకుపోయి.. చివరకు ఆత్మహత్య..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:49 IST

    ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు కీలక చర్చలు..

    • దావోస్‌లో ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి నిర్ బార్కాట్‌తో ఏపీ సీఎం సమావేశం

    • భారత్ - ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

    • ఏపీలో పెట్టుబడులకు నూతన అవకాశాలు: సీఎం చంద్రబాబు నాయుడు

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:36 IST

    ఏపీ లిక్కర్ కేసులో నిందితులకు సిట్ కస్టడీ

    • ఏపీ లిక్కర్ స్కామ్ విచారణలో వేగం పెంచిన సిట్ అధికారులు..

    • విజయవాడ కోర్టు ఆదేశాల మేరకు ప్రధాన నిందితుల విచారణ..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:30 IST

    చట్ట సభల్లో.. నో వర్క్ నో పే చట్టం తేవాలి: స్పీకర్ అయ్యన్న

    • చట్ట సభల్లో 'నో వర్క్.. నో పే' విధానం అమలులోకి తీసుకురావాలి: స్పీకర్ అయ్యన్న పాత్రుడు

    • ఇందుకు సభాపతుల సదస్సులో తీర్మానం చేయాలని ప్రతిపాదించిన అయ్యన్న..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:26 IST

    కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన బైక్.. వ్యక్తి మృతి..

    • ఉమ్మడి మహబూబ్‏నగర్ జిల్లా వనపర్తి మండలం చిన్నగుంటపల్లిలో..

    • కుక్కను తప్పించబోయి అదుపు తప్పిన బైకు..

    • ప్రమాదంలో అక్కడికక్కడే అన్న మృతిచెందగా.. తమ్ముడికి తీవ్ర గాయాలు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:23 IST

    కుప్పకూలిన ఆర్మీ శిక్షణా విమానం..

    • యూపీ: ప్రయాగ్‌రాజ్‌లో కుప్పకూలిన ఆర్మీ శిక్షణా విమానం.

    • ప్రయాగ్‌రాజ్‌ శివారులోని చెరువులో కూలిన విమానం.

    • ఘటనాస్థలిలో కొనసాగుతున్న సహాయక చర్యలు.

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:15 IST

    దావోస్‌లో రెచ్చిపోయిన కేటుగాళ్లు..

    • దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో రెచ్చిపోయిన కేటుగాళ్లు..

    • నకిలీ వీఐపీ పాసులతో బిలియనీర్లను బురిడీ కొట్టించిన వైనం..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:11 IST

    ఏపీ లిక్కర్ కేసు.. సుప్రీం కోర్టులో నిందితులకు ఎదురుదెబ్బ..

    • ఏపీ లిక్కర్ కేసులో సుప్రీం కోర్టులో నిందితులకు షాక్

    • హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించిన సుప్రీం ధర్మాసనం..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 13:01 IST

    జట్టుకు కష్టాలు తప్పవు: రోహిత్ శర్మ

    • సూర్య కుమార్ యాదవ్‌ సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతే.. బ్యాటింగ్ లైనప్ ఇబ్బంది పడుతుంది: రోహిత్ శర్మ

    • టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్‌కు రోహిత్ శర్మ కీలక సూచన..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 12:56 IST

    విద్యార్థులే లక్ష్యంగా రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా

    • ఏపీ ప్రభుత్వం చేపట్టిన కెరీర్ గైడర్స్ సర్వేలో విస్తుపోయే నిజాలు..

    • ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి..

    • విద్యార్థుల ప్రవర్తన, వారిని వేధిస్తున్న డ్రగ్స్ ముఠాలపై చర్యలు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 12:49 IST

    ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

    • ఇరాన్ నాపై హత్యకు పాల్పడితే భూస్థాపితమే: డొనాల్డ్ ట్రంప్

    • ఇరాన్‌లో రాజకీయ పరిస్థితులు మారాలి: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 12:45 IST

    ఏపీ లిక్కర్ కేసులో నిందితుల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు

    • ట్రయల్ కోర్టు ఇచ్చిన డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసిన హైకోర్టు

    • హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేసిన నిందితులు కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్ప

    • సీజేఐ జస్టిస్ సూర్యకాంత నేతృత్వంలోని ధర్మాసనం విచారణ..

    • హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం సీజేఐ ధర్మాసనం..

    • రెగ్యులర్ బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని సీజేఐ ధర్మాసనం ఆదేశం..

  • Jan 21, 2026 12:41 IST

    స్వీట్ షాపులో చిరుత.. చివరికి ఏం జరిగిందంటే?

    • కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‌లో షాకింగ్ ఘటన..

    • స్వీట్ షాప్‌లోకి చొరబడిన చిరుత..

    • భయంతో పారిపోయిన ప్రజలు..

    • పట్టుకునే క్రమంలో అటవీ సిబ్బందికి గాయాలు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 12:35 IST

    తాగునీటి కాలువలో స్పిరిట్ లారీ బోల్తా..

    • కాకినాడలోని పీబీసీ కాలువలో స్పిరిట్ లారీ బోల్తా..

    • తాగునీరు కలుషితమవడంతో అప్రమత్తమైన అధికారులు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 12:25 IST

    నాలుగో బిడ్డకు తండ్రి కానున్న అమెరికా ఉపాధ్యక్షుడు..

    • శుభవార్త చెప్పిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు..

    • మా ఇంటికి కొత్త అతిథి రాబోతున్నాడు, బాబు పుట్టబోతున్నాడు: జేడీ వాన్స్

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 12:10 IST

    ఫోన్ ట్యాపింగ్ పేరుతో డ్రామా: ఎమ్మెల్సీ కవిత

    • మున్సిపల్ ఎన్నికల సమయంలోనే విచారణ ఎందుకు చేస్తున్నారు?

    • ఫోన్ ట్యాపింగ్ విచారణ తుది దశకు చేరుతుందని అనుకోవడం లేదు..

    • విచారణతో బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు: కవిత

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 12:09 IST

    స్టాలిన్ వ్యాఖ్యలు.. విద్వేష ప్రసంగమే..

    • సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు విద్వేష ప్రసంగమే: మద్రాసు హైకోర్ట్

    • ఈ వ్యవహారంలో బీజేపీ నేత అమిత్ మాలవీయపై నమోదైన కేసును కొట్టేసిన కోర్టు..

    • 2023లో ఓ సభలో స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే..

  • Jan 21, 2026 12:01 IST

    ఒకే వేదికపై సీఎం రేవంత్‌రెడ్డితో చిరంజీవి..

    • స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ఓకే వేదికపై సీఎం రేవంత్‌రెడ్డితో చిరంజీవి..

    • సీఎం ఆహ్వానంతో దావోస్ సదస్సుకు హాజరైన చిరంజీవి..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 11:57 IST

    కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనపై చర్యలు..

    • ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ బ్యాటర్ వికెట్ కీపర్ లిజెలీ లీకి షాక్..

    • ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించినందుకు చర్యలు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 11:54 IST

    రోహిత్ శర్మ వద్దకు దూసుకొచ్చిన మహిళ

    • టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ భద్రతలో సిబ్బంది వైఫల్యం..

    • రోహిత్ శర్మ వద్దకు ఒక్కసారిగా దూసుకొచ్చిన మహిళ..

    • కుమార్తె ఆరోగ్యం బాలేదని సాయం చేయాలంటూ వేడుకోలు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 11:52 IST

    నగరపాలక రిజర్వేషన్లపై మధ్యంతర ఉత్తర్వులు..

    • నిజామాబాద్ నగరపాలక రిజర్వేషన్లపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు..

    • 39, 40, 44 డివిజన్ల రిజర్వేషన్లపై కోర్టును ఆశ్రయించిన బీజేపీ నేత

    • దీనిపై 3 రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు..

  • Jan 21, 2026 11:46 IST

    వీధి కుక్కల తరలింపుపై కేసు నమోదు..

    • వీధి కుక్కల తరలింపుపై యాచారంలో కేసు నమోదు..

    • రంగారెడ్డి జిల్లా యాచారం పంచాయతీలో 100 కుక్కలను చంపినట్లు జంతు ప్రేమికుల ఫిర్యాదు..

    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

  • Jan 21, 2026 11:15 IST

    వరంగల్ డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు..

    • వరంగల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు..

    • లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వెంకట్ రెడ్డి..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 11:13 IST

    ఆర్మీ వాహనం ఢీకొని విద్యార్థి మృతి..

    • సికింద్రాబాద్‌లోని తిరుమలగిరి ఆర్మీ పబ్లిక్ స్కూల్ వద్ద విషాదం

    • ఆర్మీ వాహనం ఢీకొని విద్యార్థి మృతి..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 11:11 IST

    బంగ్లా.. టీ20 ప్రపంచ కప్ ఆడనుందా? కెప్టెన్ స్పందనిదే..

    • టీ20 ప్రపంచ కప్ 2026లో బంగ్లాదేశ్ పాల్గొంటుందా? లేదా?

    • ఐపీఎల్ నుంచి బంగ్లా ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించడంతో దుమారం..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 11:08 IST

    గంజాయి బ్యాచ్ వీరంగం.. ఇళ్లపై దాడులు..

    • తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో గంజాయి బ్యాచ్ వీరంగం..

    • ఇళ్ల అద్దాలు, డోర్లు, వాహనాలపై రాళ్లతో దాడులు..
      పూర్తి కథనం..

  • Jan 21, 2026 10:57 IST

    ట్రంప్ విమానంలో సాంకేతిక లోపం.. అధికారుల అలర్ట్..

    • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమానంలో సాంకేతిక లోపం..

    • వాషింగ్టన్ సమీపంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో తప్పిన ప్రమాదం.

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 10:43 IST

    వసంత పంచమి ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి.?

    • ఈ మాసంలో వచ్చే వసంత పంచమితో ఈ పర్వదినాలు ప్రారంభం..

    • ఆ రోజు ఏం చేస్తే.. ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 10:36 IST

    బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్నారు..

    • బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నారు: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

    • భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు: ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 10:20 IST

    అందువల్లే టీమిండియాకు ఈ పరిస్థితి: అజింక్య రహానే

    • టీమిండియా ఓటములపై సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే స్పందన..

    • జట్టు కూర్పులో మార్పులు ఎక్కువగా చేయడమే కారణమని ఆరోపణ..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 10:10 IST

    కారు ప్రమాదంలో నలుగురి మృతి..

    • రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి..

    • బర్త్‌డే పార్టీ చేసుకుని కారులో వస్తుండగా ప్రమాదం..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 10:01 IST

    పుర్రె ఎముక తెరవకుండానే సర్జరీ..

    • హైటెక్‌ సిటీలోని కేర్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు..

    • పుర్రె ఎముక తెరవకుండా మెదడులోని క్యాన్సర్‌ కణతిని తొలగించిన వైద్యులు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 09:48 IST

    నేరగాళ్ల గుర్తింపునకు పోలీసుల కొత్త విధానం..

    • ఆటోలు, డ్రైవర్ల వివరాల సేకరణకు అప్లికేషన్ తయారు..

    • ప్రత్యేకంగా అప్లికేషన్ రూపొందించిన అధికారులు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 09:41 IST

    హైదరాబాద్ బేగంపేట ఫ్లైఓవర్‌పై రోడ్డు ప్రమాదం

    • అతివేగంగా దూసుకొచ్చి డివైడర్‌ను ఢీకొన్న కారు

    • ఐదుగురు ప్రయాణికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

    • కారు వదిలేసి పరారైన డ్రైవర్, దర్యాప్తు చేపట్టిన పోలీసులు

      పూర్తి కథనం

  • Jan 21, 2026 09:22 IST

    హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం..

    • అమెరికా స్టాక్ బ్రోకర్‌ పేరుతో భారీ మోసం..

    • రూ. 1.04 కోట్లు లాగేసిన సైబర్ కేటుగాడు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 09:17 IST

    మేడారం మహాజాతరలో నేడు తొలి ఘట్టం..

    • 'మండమెలిగే' పండుగతో మేడారం జాతర ప్రారంభం..

    • 25వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 09:00 IST

    పోటాపోటీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు..

    • బంగారం, వెండి ధరలు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి..

    • ఈరోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 08:21 IST

    తూ.గో. జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 26 మంది విద్యార్థులకు గాయాలు..

    • తూర్పుగోదావరి జిల్లా రాజానగరం పరిధిలో రోడ్డు ప్రమాదం..

    • రెండు విద్యార్థుల బస్సులు, రెండు ట్రావెల్ బస్సులు ఒకదానికొకటి ఢీ..

    • 26 మంది విద్యార్థులు గాయపడ్డారు.. ప్రాణాపాయం లేదన్న వైద్యులు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 08:18 IST

    నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు

    • బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ మధ్య నేటి నుంచి రెండు కొత్త రైళ్లు..

    • ఏపీలోని పలు స్టేషన్ల మీదుగా ప్రయాణం చేయనున్న రైళ్లు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 08:15 IST

    సునీతా విలియమ్స్ పదవీ విరమణ

    • నాసా నుంచి అధికారికంగా పదవీ విరమణ చేసిన సునీతా విలియమ్స్..

    • 27 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన విలియమ్స్..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 07:42 IST

    దుర్గంచెరువు దుర్గంధంపై ‘హైడ్రా’ నజర్‌

    • రాంకీ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే చెరువు దుర్గంధం..

    • అభివృద్ధి పనుల సమయంలో ట్రాఫిక్‌ డైవర్షన్‌కు సహకరించాలి: హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 07:25 IST

    రూ.91 వేల కోట్ల పెట్టుబడి.. లక్ష ఉద్యోగాలు..

    • ఏపీలో మరో భారీ పెట్టుబడికి ముందుకొచ్చిన సంస్థ..

    • రూ.91,000 కోట్ల పెట్టుబడితో లక్ష మందికి ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యం..

    • దావోస్‌లో ఏపీ సర్కారు, ఆర్‌ఎంజెడ్‌ ప్రకటన..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 07:23 IST

    ఆ మూడూ తమవే అంటున్న ట్రంప్..

    • కెనడా, వెనెజువెలా, గ్రీన్‌లాండ్‌లను అమెరికా భూభాగాలుగా చూపించే మ్యాప్‌..

    • అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. తన ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 06:52 IST

    ఈ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్..

    • హైదరాబాద్ నగరంలో నేడు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫాలో అంతరాయం..

    • ఏయే ప్రాంతాల్లో ఎన్ని గంటల వరకూ పవర్ కట్ ఉంటుందంటే..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 06:27 IST

    ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!

    • 3 నెలల అనంతరం మోగనున్న పెళ్లి బాజాలు..

    • ఫిబ్రవరి 19 నుంచి వివాహ ముహూర్తాలు..

    • పురోహితులు, క్యాటరర్లు, వెడ్డింగ్‌ ప్లానర్ల డైరీలన్నీ ఫుల్‌..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 06:25 IST

    5 నిమిషాలు ఆలస్యమైనా ఓకే..

    • ఇంటర్మీడియట్‌ పరీక్షల విషయంలో బోర్డు కీలక నిర్ణయం..

    • ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతి..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 06:15 IST

    హైదరాబాద్‌ సమీపంలో పెద్దపులి సంచారం..

    • యాదాద్రి జిల్లా ఇబ్రహీంపూర్‌ దగ్గర పాదముద్రలు..

    • స్థానికులను అప్రమత్తం చేసిన అధికారులు..

      పూర్తి కథనం..

  • Jan 21, 2026 06:13 IST

    వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌..

    • వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్‌ ఫస్టియర్‌లో కొత్త సిలబస్..

    • ఇంటర్‌బోర్డు సమావేశంలో నిర్ణయం..

      పూర్తి కథనం..