Share News

బీఎంసీ మేయర్ జగడం.. షిండే ఢిల్లీ వెళ్లాల్సిందేనన్న సంజయ్ రౌత్

ABN , Publish Date - Jan 21 , 2026 | 07:23 PM

బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-షిండే శివసేన 118 స్థానాలతో మెజారిటీ మార్క్‌ను దాటి స్పష్టమైన విజయం సాధించిది. అయితే మేయర్ పదవికి ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

బీఎంసీ మేయర్ జగడం.. షిండే ఢిల్లీ వెళ్లాల్సిందేనన్న సంజయ్ రౌత్
Sanjay Raut with Eknath Shinde

ముంబై: బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో (BMC) మహాయుతి కూటమి విజయంతో మేయర్ పదవిని ఆశిస్తున్న ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde)పై యూబీటీ నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఎంసీ మేయర్ పదవిని ఆయన కావాలనుకుంటే మొదట బీజేపీ సీనియర్ నేతలను ఒప్పించాల్సి ఉంటుందని అన్నారు.


బీఎంసీ ఎన్నికల్లో బీజేపీ-షిండే శివసేన 118 స్థానాలతో మెజారిటీ మార్క్‌ను దాటి స్పష్టమైన విజయం సాధించింది. అయితే మేయర్ పదవి ఏ పార్టీకి దక్కుతుందనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఎంసీలోని మొత్తం 227 స్థానాల్లో బీజేపీ 89 స్థానాలు గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది. అయినప్పటికీ మేయర్ పదవిని కైవసం చేసుకోవడం ద్వారా బీఎంసీపై తమ పట్టు కొనసాగించాలని షిండే శివసేన ఆసక్తి చూపుతోంది.


షిండేను పట్టించుకునే వారే లేరు..

మహాయుతి నుంచి బీఎంసీ మేయర్ పోస్ట్ విషయంలో షిండేను పట్టించుకునే వారే లేరని సంజయ్ రౌత్ తెలిపారు. బాలాసాహెబ్ ఫోటోను పెట్టుకుని తమదే నిజమైన శివసేన అని చెప్పుకునే వారు మేయర్ పోస్ట్ కోసం ఢిల్లీ వెళ్లి గుజరాతీ లీడర్ల కాళ్లపై పడాల్సి ఉంటుందని, ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదని ఘాటుగా విమర్శించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరంలో పాల్గొనేందుకు వెళ్లడంతో బీఎంసీ మేయర్ ప్రకటనలో జాప్యం జరుగుతోందని రౌత్ అభిప్రాయపడ్డారు. భారత కంపెనీలతో అగ్రిమెంట్లపై సంతకాలు చేసేందుకు దావోస్ వరకూ సీఎం వెళ్లాల్సిన అవసరం లేదని, ముంబైలోనే సంతకాలు చేయవచ్చని అన్నారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ములతో విదేశాల్లో పర్యటిస్తున్నారని, రాజకీయ నేతల విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులను ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం

ఉద్ధవ్‌కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్‌ఎస్

Read Latest National News

Updated Date - Jan 21 , 2026 | 08:14 PM