Share News

ఆరావళిలో అక్రమ మైనింగ్‌పై నిపుణుల కమిటీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 06:12 PM

ఆరావళి నిర్వచనంపై గతంలో ఇచ్చిన తీర్పు, దానిపై వస్తున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు సుమోటోగా సుప్రీంకోర్టు ఈ కేసును స్వీకరించింది.

ఆరావళిలో అక్రమ మైనింగ్‌పై నిపుణుల కమిటీ.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Supreme Court on Aravalli region mining

న్యూఢిల్లీ: ఆరావళి (Aravalli) పర్వత శ్రేణుల్లో అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర స్థాయిలో స్పందించింది. దీనివల్ల కోలుకోలేనంత నష్టం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పర్యావరణానికి జరిగే నష్టాన్ని నివారించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానం నిర్ణయించింది. ఆరావళి నిర్వచనంపై గతంలో ఇచ్చిన తీర్పు, దానిపై వస్తున్న అభ్యంతరాలను పరిష్కరించేందుకు సుమోటోగా కోర్టు ఈ కేసును స్వీకరించింది.


చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, న్యాయమూర్తులు జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం.పాంచోలితో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ చేపట్టింది. నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ, మైనింగ్‌లో నిపుణులైన పర్యావరణవేత్తలు, సైంటిస్టుల పేర్లను నాలుగు వారాల్లోగా తమకు తెలియజేయాలని అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి, అమికస్ క్యూరీ కె.పరమేశ్వర్‌లను ఆదేశించింది. ఈ కమిటీ మైనింగ్, సంబంధిత సమస్యలపై పరిశీలన చేసి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో పనిచేస్తుందని తెలిపింది. గతంలో విధించిన మైనింగ్ నిషేధాన్ని కొనసాగిస్తూ కొత్త లీజులను అనుమతించవద్దని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.


ఈ వార్తలు కూడా చదవండి.

26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం

ఉద్ధవ్‌కు షాక్.. షిండే వర్గానికి మద్దతు ప్రకటించిన ఎంఎన్‌ఎస్

Read Latest National News

Updated Date - Jan 21 , 2026 | 06:41 PM