దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు బిగ్ రిలీఫ్
ABN , Publish Date - Jan 21 , 2026 | 08:26 PM
ఏపీలో దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు బిగ్ రిలీఫ్ దక్కింది. రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను కూటమి ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన పారిశ్రామికవేత్తలకు భారీ ఊరటనిచ్చింది. రెండో విడత పారిశ్రామిక ప్రోత్సాహకాలను మంగళవారం విడుదల చేసింది. ఈ విడతలో మొత్తం 3,617 మంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.60.21 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ.53.05 కోట్లు, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.7.16 కోట్ల ప్రోత్సాహకాలను విడుదల చేసినట్లు రాష్ట్ర ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
దళిత, గిరిజన వర్గాల పారిశ్రామికవేత్తలను ఆర్థికంగా బలోపేతం చేసి, వ్యాపార రంగంలో ఎదిగేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 11,451 మంది పారిశ్రామికవేత్తలకు రూ.269.9 కోట్ల విలువైన పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించినట్లు మంత్రి వెల్లడించారు. భవిష్యత్తులోనూ ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
Also Read:
26-26 ఉగ్ర కుట్రకు ప్లాన్.. నిఘా వర్గాలు అప్రమత్తం
కస్టమర్‌పై దాబా యజమాని దారుణం.. ధరలు అధికంగా ఉన్నాయని అన్నందుకు..
For More Latest News