Share News

కస్టమర్‌పై దాబా యజమాని దారుణం.. ధరలు అధికంగా ఉన్నాయని అన్నందుకు..

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:33 PM

దాబా యజమాని ఓ కస్టమర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

కస్టమర్‌పై దాబా యజమాని దారుణం.. ధరలు అధికంగా ఉన్నాయని అన్నందుకు..
A disturbing video

మహారాష్ట్ర, జనవరి 21: థానె జిల్లాలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది. దాబా యజమాని ఓ కస్టమర్‌పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. ఆహార పదార్థాల ధరలు అధికంగా ఉన్నాయని ప్రశ్నించినందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. దాబా యజమానితో పాటు మరో వ్యక్తి కూడా ఈ దాడిలో పాల్గొన్నాడు. ఇద్దరూ కలిసి కస్టమర్‌ను చావగొట్టారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని భివాండి, సమృద్ధి ఎక్స్‌ప్రెస్ వేపై ‘పంజాబీ ఖల్సా హోటల్’ అనే దాబా ఉంది. కొద్దిరోజుల క్రితం నరేందర్ తోమర్ అనే యువకుడు భోజనం చేయడానికి ఆ దాబాకు వెళ్లాడు.


నాలుగు చపాతీలు, కర్రీ తిన్నాడు. బిల్లు 180 అయిందని తెలియగానే షాక్ అయ్యాడు. నాలుగు చపాతీలు, కర్రీలకు అంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయటంపై గొడవ పెట్టుకున్నాడు. అక్కడి ధరల గురించి మాట్లాడుతూ వీడియో తీశాడు. దీంతో దాబా యజమాని బాబా ఆగ్రహానికి గురయ్యాడు. నరేందర్‌పై దాడికి దిగాడు. విచక్షణా రహితంగా కొట్టాడు. కొద్దిసేపటి తర్వాత దాబాలో పని చేసే మరో వ్యక్తి కూడా బాబాకు జత కలిశాడు. నరేందర్‌పై దాడి చేయటం మొదలెట్టాడు. ఈ ఇద్దరూ కలిసి నరేందర్‌ను తీవ్రంగా గాయపరిచారు.


నరేందర్ ఫోన్‌లో రికార్డయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 44 సెకన్ల వీడియోలో దాడికి సంబంధించిన దారుణ దృశ్యాలు ఉన్నాయి. వైరల్‌గా మారిన వీడియో థానే పోలీసు అధికారుల దృష్టికి వెళ్లింది. పోలీసులు దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇక, ఈ దాడిపై స్పందిస్తున్న నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాబా యజమానితో పాటు దాడికి పాల్పడిన మరో వ్యక్తిపైనా వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని అంటున్నారు.


ఇవి కూడా చదవండి

నోటి పూత.. పదే పదే రావడానికి కారణాలు ఇవే.!

గ్రీన్‌ అమ్మోనియా కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి: మంత్రి లోకేశ్

Updated Date - Jan 21 , 2026 | 06:02 PM