Share News

గ్రీన్‌ అమ్మోనియా కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:41 PM

రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో మంత్రి నారా లోకేశ్ బిజీ బిజీగా గడుపుతున్నారు. వివిధ దేశాలకు చెందిన వ్యాపార వేత్తలు, సీఈఓలతో భేటీ అవుతూ.. పెట్టుబడులను ఆకర్షిస్తున్నారు.

గ్రీన్‌ అమ్మోనియా కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి: మంత్రి లోకేశ్
Nara Lokesh Davos

ఇంటర్నెట్ డెస్క్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ దేశాలకు చెందిన వ్యాపార వేత్తలు, సీఈఓలతో భేటీ అవుతూ ఏపీ మంత్రి నారా లోకేశ్(Nara Lokesh) బిజీ బిజీగా గడుపుతున్నారు. తాజాగా.. జపాన్‌కు చెందిన ప్రముఖ రెన్యువబుల్ ఎనర్జీ సంస్థ జెరా(JERA) గ్లోబల్ సీఈవో అండ్ ఛైర్మణ్ యుకియో కానితో మంత్రి లోకేశ్ దావోస్‌లో భేటీ అయ్యారు. ఏపీలోని గ్రీన్ అమ్మోనియా తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు లోకేశ్.


జపాన్, ఇతర ఆసియా మార్కెట్లకు లో-కార్బన్ అమ్మోనియాను సరఫరా చేయడానికి మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకుని సమీపంలోని గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని వారికి విజ్ఞప్తి చేశారు లోకేశ్. పారిశ్రామిక వినియోగదారులకు దృఢమైన క్లీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి రాయలసీమలో సౌర-పవన హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని వెల్లడించారు.


జపాన్ భవిష్యత్తు క్లీన్ ఇంధన దిగుమతులకు మద్దతు ఇవ్వడానికి భారత్‌లో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వాల్యూ చైన్లను ఏర్పాటు చేయాలని జెరా సంస్థ(JERA CEO Yukio Kani) నిర్ణయించుకుంది. రెన్యూ ఎనర్జీ గ్లోబల్‌తో భాగస్వామ్యం ద్వారా యుటిలిటీ-స్కేల్ పునరుత్పాదక శక్తి తయారీలో భాగస్వామ్యం వహిస్తున్నట్లు జెరా సీఈవో యుకియో వెల్లడించారు. పునరుత్పాదక శక్తితో పాటు ఎల్ఎన్‌జీ ఆధారిత విద్యుత్ పరివర్తన, గ్రిడ్-బ్యాలెన్సింగ్ పరిష్కారాలపై దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు.



ఇవి కూడా చదవండి..

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

Updated Date - Jan 21 , 2026 | 04:52 PM