Share News

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:57 AM

కాకినాడలోని పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా పడటంతో నీరంతా కలుషితంగా మారిపోయింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. కాల్వలో నీటిని శుభ్రం చేసే పనులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు.

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు
Kakinada Spirit Lorry Accident

కాకినాడ, జనవరి 21: తొండంగి మండలం ఏవీ నగరం పీబీసీ కాల్వలో ఓ స్పిరిట్ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కాల్వలో స్పిరిట్ కలిసిపోయి నీరంతా కలుషితమైంది. పీబీసీ కాల్వ ద్వారా తొండంగి మండలంలోని 16 గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతోంది. ఈ ప్రమాదం వల్ల ఏవీ నగరం పంపింగ్ స్కీమ్ నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. విషయం తెలిసిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. తాత్కాలికంగా ఆ నీటిని తాగవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.


ఈ విషయమై తుని నియోజకవర్గ ఎమ్మెల్యే యనమల దివ్య స్పందించారు. అధికారులతో మాట్లాడి ప్రత్యామ్నాయ నీటి సరఫరా ఏర్పాట్లు చేయమని సూచించారు. శుభ్రమైన తాగునీరు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావడంతో.. సమస్యా పరిష్కారం కోసం అధికారులతో ఎమ్మెల్యే చర్చలు నిర్వహించారు.

ప్రస్తుతం.. కాల్వలో నీటిని శుభ్రం చేసే పనులు, ప్రత్యామ్నాయ సరఫరా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ప్రజలు హెచ్చరికలను పాటించి, బాటిల్ వాటర్ లేదా ఇతర సురక్షిత మార్గాల్లో తాగునీటిని వాడాలని సూచిస్తున్నారు. ఈ సమస్య త్వరగా పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

నేరగాళ్ల గుర్తింపునకు పోలీసుల కొత్త విధానం

గంజాయి బ్యాచ్ వీరంగం.. ఇళ్లపై దాడులు.. భయాందోళనలో గ్రామస్థులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 12:52 PM