Share News

నోటి పూత.. పదే పదే రావడానికి కారణాలు ఇవే.!

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:44 PM

పదే పదే నోటి పూతలు రావడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే.. నోటి పూతలు తరచుగా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

నోటి పూత.. పదే పదే రావడానికి కారణాలు ఇవే.!
Mouth Ulcers Causes

ఇంటర్నెట్ డెస్క్: నోటి పూత అనేది చాలా సాధారణ సమస్య. కొన్ని రోజులపాటు వచ్చే పూతలు సాధారణంగా తేలికపాటి ఇన్ఫెక్షన్, జీర్ణ సమస్యల వల్ల వస్తాయి. కానీ, పదే పదే నోటి పూతలు రావడం తీవ్రమైన అనారోగ్యానికి సంకేతం కావచ్చు. కాబట్టి దాన్ని గమనించి, సరైన చర్యలు తీసుకోవడం అవసరం. అయితే.. నోటి పూతలు తరచుగా రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? వాటిని ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


నోటి పూతకు సాధారణ కారణాలు

  • శరీరంలో ఫోలిక్ యాసిడ్ లేదా ఐరన్ లోపం

  • జీర్ణ సమస్యలు, అలసట

  • ఎక్కువ కారంగా ఉన్న ఆహారం తినడం

  • కొంతమందిలో పూతలు ప్రతి 3–4 నెలలకు ఒకసారి వస్తాయి, మాయమవుతాయి. కానీ కొన్ని రోజులకోసారి పునరావృతం అవుతుంటే వైద్య సలహా అవసరం.


ప్రమాదకరం..

  • ప్రతి నెలా పదే పదే నోటి పూతలు రావడం, నోటి నుంచి స్వల్ప రక్తస్రావం, బరువులో తేడాలు లేదా తగ్గడం లేదా ఒక నెలపాటు కూడా నోటిపూత తగ్గకపోవడం వంటి సమస్యలు ఉన్నప్పుడు జాగ్రత్త పడటం మంచిది. ఈ లక్షణాలు నోటి క్యాన్సర్, పేగు వ్యాధులు, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం, కొన్నిసార్లు HIV వైరస్ వంటి ఆరోగ్య సమస్యలతోనూ సంబంధం ఉండవచ్చు.

  • ధూమపానం లేదా పొగాకు అలవాటు ఉన్నవారికి నోటి పూత రావడం ఎక్కువ ప్రమాదకరం, ఎందుకంటే పొగాకు వల్ల నోటి మ్యూకస్ లైనింగ్‌ దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

  • డయాబెటిక్ రోగులకు కూడా నోటి పూతలు ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అలాగే విటమిన్ B12 లోపం ఉన్నవారికి కూడా పూతలు, మరింతగా వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

  • జీర్ణ సమస్యలు, ముఖ్యంగా కొన్ని అంతర్గత వ్యాధులు ఉన్నవారిలో నోటి పూతలు తరచుగా వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.


నోటి పూత తగ్గాలంటే గోరువెచ్చని ఉప్పునీటితో పుక్కిలించడం, కారం, పుల్లని, వేడి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే తేనె రాయడం, మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు తాగడం మేలని చెబుతున్నారు. అంతేకాకుండా విటమిన్ బి, జింక్ వంటి పోషకాలున్న ఆహారం తినడం మంచిదని సూచిస్తున్నారు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు.

Also Read:

తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?

జామపండును తొక్కతో తినాలా? లేక తీసేసి తినాలా?

For More Latest News

Updated Date - Jan 21 , 2026 | 04:59 PM