నాసా వ్యోమగామి సునీతా విలియమ్స్ పదవీ విరమణ
ABN , Publish Date - Jan 21 , 2026 | 08:03 AM
సునితా విలియమ్స్ తన సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణం తర్వాత నాసా నుంచి అధికారికంగా పదవీ విరమణ చేశారు..
ఇంటర్నెట్ డెస్క్: నాసా వ్యోమగామి సునితా విలియమ్స్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తాజాగా సునితా విలియమ్స్ కీలక ప్రకటన చేశారు. నాసా నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించారు. 1998 లో ఏజెన్సీలో చేరినప్పటి నుంచి అంతరిక్ష విమాన రికార్డులు సృష్టించింది. 27 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించారు. సునితా విలియమ్స్ మూడు సార్లు ISS యాత్రలను పూర్తి చేసి, మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపారు. ఒక మహిళా వ్యోమగామిగా అత్యధిక సమయం (62 గంటలు) స్పేస్‌వాక్ చేసిన రికార్డును కూడా ఆమె సొంతం చేసుకున్నారు.
విలియమ్స్ మొదటిసారిగా 2006లో డిస్కవరీ స్పేస్ షటిల్‌లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. 2012లో రష్యన్ సోయుజ్ క్యాప్సూల్‌లో కక్ష్యలోకి తిరిగి వచ్చారు. ఆమె తన చివరి మిషన్‌లో భాగంగా జూన్ 2024లో బోయింగ్ స్టార్ లైనర్ (Boeing Starliner) ద్వారా అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల అక్కడ 9 నెలల పాటు ఉండాల్సి వచ్చింది. మార్చి 2025 లో స్పేస్ (SpaceX) క్రూ డ్రాగన్ నౌక ద్వారా సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
అబూ సలేంకు పెరోల్ ఇవ్వొద్దు.. ముంబై కోర్టుకు తెలిపిన మహారాష్ట్ర ప్రభుత్వం
నితిన్ నబీన్‌కు జడ్ కేటగిరీ సెక్యూరిటీ
Read Latest National News