ఆ ఏరియా వాసులకు బిగ్ అలెర్ట్.. 10 గంటల నుంచి కరెంట్ కట్
ABN , Publish Date - Jan 21 , 2026 | 06:46 AM
హైదరాబాద్ మహా నగరంలోని ఆయా ఏరియాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. ఉదయం పది గంటల నుంచి విద్యుత్ సరఫరా ఉండడదని తెలిపారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపీ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ సీఆర్‌పీఎఫ్, మారుతి నగర్ ఫీడర్ల పరిధిఖలోని పలు ప్రాంతాలు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ బంజారాహిల్స్ రోడ్ నెంబర్.12, అక్బర్ ఫాం ఫీడర్ల పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ ఎల్‌వీ సత్యనారాయణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 11 కేవీ బేగంపేట ప్లే గ్రౌండ్, ఇండస్ర్టీయల్ ఎస్టేట్స్ ఫీడర్ల పరిధి, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 11 కేవీ గ్రీన్‌పార్కు, బ్రహ్మణవాడి, సారథి నగర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని కోరారు.
చిక్కడపల్లి: ఫీడర్ మరమ్మతుల కారణంగా బుధవారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి. వినోద్‌కుమార్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా, పటేల్‌నగర్, బతుకమ్మకుంట, అంబర్‌పేట్, బషీర్‌బాగ్, జాఫర్ అలీబాగ్ ప్రాంతాల్లో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆజామాబాద్ ఇండస్ట్రియల్, విద్యానగర్ లేన్, నిజామ్‌కాలేజ్, కపాడియా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని పేర్కొన్నారు.
రామంతాపూర్: రామంతాపూర్ పాలిటెక్నిక్ ఇండోర్ సబ్ స్టేషన్ పరిధిలోని ప్రాంతాలలో ఈనెల 21న బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ట్రాన్స్‌కో ఏఈ కూతాడి లావణ్య ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగంగా వెంకట్‌రెడ్డినగర్ ఫీడర్‌లోని గోఖలేనగర్, బృందావన్ గ్రౌండ్స్, రాఘవేంద్ర స్వామి ఆలయ ఫీడర్‌లోని పాశం సత్తయ్య కాలనీ, గణేష్ నగర్, రామంతాపూర్ కాలనీ, మెయిన్ రోడ్డు ప్రాంతాలలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని ఆమె తెలిపారు.

ఎల్లారెడ్డిగూడ ఫీడర్ పరిధిలో..
కాప్రా: చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా ఎల్లారెడ్డిగూడ ఫీడర్ పరిధిలోని హనుమాన్‌నగర్, ఎన్‌ఆర్‌ఐ కాలనీ, ఆర్టీసీ కాలనీ, శ్రీసాయినగర్, వినాయక్‌నగర్, సాయిసుమ ఎన్‌క్లేవ్ పరిసర ప్రాంతాలలో బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, శాలివాహన ఫీడర్ పరిధిలోని శాలివాహన ఎన్‌క్లేవ్, కృష్ణానగర్, గౌరినాథపురం, పద్మారావునగర్, హైటెక్ కాలనీ, తాళ్లబాయి, దాబాగార్డెన్, కాప్రా, ఎల్లారెడ్డిగూడ, మనోజ్ ఎన్‌క్లేవ్ పరిసర ప్రాంతాలలో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్టు సైనిక్‌పురి సబ్‌స్టేషన్ ఏఈ తెలిపారు.
నార్సింగ్: హిమాయత్‌సాగర్ ఫీడ ర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్ సరఫరా ఉండదని ఏఈ ఎ.రమేశ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఫ11 కేవీ స్నేహితహిల్స్ ఫీడర్ పరిధిలోని స్నేహితహిల్స్ ఫేజ్-1, 2, బోర్డ్‌వే హోటల్, స్నేహితహిల్స్ జన్నూర్ క్వాటర్స్, పీబెల్‌సిటీల్లో ఉదయం విద్యుత్ సరఫరా ఉండదు. ఫ 11 కేపీ పీరంచెరువు ఫీడర్ పరిధిలోని సాదాన్ మెడికల్ కాలేజీ, సాదాన్ ఇంజనీరింగ్ క్యాంపస్, పీరంచెరువు విలేజ్, వసతి అపార్ట్‌మెంట్ తదితర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు. ఫ 11 కేవీ పీ అండ్ టీ కాలనీ ఫీడర్ పరిధిలోని అక్బర్ కాలనీ, సబి తా ఇంద్రారెడ్డి కాలనీ, పీరంచెరువు ఓల్డ్ గ్రామం ప్రాంతాల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 వరకు విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ శాఖాధికారులు తెలిపారు.
గాజులరామారం: విద్యుత్ సంబంధ మరమ్మతుల కారణంగా గాజులరామారం సబ్‌స్టేషన్ పరిధిలోని కైలా్‌సహిల్స్, శంషీగూడ ఫీడర్ల పరిధిలో బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ చైతన్య భార్గవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు షిరిడీ హిల్స్, నందిని హిల్స్, కైలా్‌సహిల్స్ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదన్నారు. విద్యుత్‌కు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తేే ఫోన్ నెంబరు 8712472564కు ఫిర్యాదు చేయాలని ఏఈ కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
Read Latest Telangana News and National News