Share News

స్వీట్ షాపులో చిరుత.. చివరికి ఏం జరిగిందంటే? వీడియో వైరల్..

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:34 AM

ఇటీవల అడవుల్లో ఉండాల్సిన క్రూర మృగాలు పట్టణాలు, గ్రామాల్లోకి రావడంతో ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కేంద్రపాలిత ప్రాంతం డామన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..

స్వీట్ షాపులో చిరుత.. చివరికి ఏం జరిగిందంటే? వీడియో వైరల్..
leopard Enters Shop Daman

ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర పాలిత ప్రాంతమైన డామన్‌లో ఒక స్వీట్ షాప్‌లోకి చిరుతపులి ప్రవేశించింది. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది దాదాపు 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి సురక్షితంగా చిరుతను పట్టుకున్నారు. మంగళవారం నాని డామన్ ప్రాంతంలోని ఒక మార్కెట్ వద్ద ఉన్న స్వీట్ షాప్‌లోకి చిరుత ప్రవేశించింది. చిరుతను చూసి షాపు యజమాని, చుట్టు పక్కల వాళ్లు భయంతో వణికిపోయారు. వెంటనే పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు.


రెస్క్యూ టీమ్ ట్రాంక్విలైజింగ్ గన్స్, వలలు ఉపయోగించి ఒక బోను ఏర్పాటు చేశారు. చిరుత అటవీ సిబ్బందిపై పలుమార్లు దాడి చేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. ఇక చిరుతను పట్టుకోవడం కష్టమని భావించిన అటవీ సిబ్బంది మహారాష్ట్రలోని దహాను నుంచి మరో రెస్క్యూ టీమ్‌ని పిలిపించారు. రెస్క్యూ టీమ్ చిరుతపులికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, తర్వాత బోనులో బంధించామని అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా డామన్ పట్టణ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు ట్రాక్ చేస్తున్నాం. మొత్తానికి దాన్ని గుర్తించి ఈ రోజు సురక్షితంగా పట్టుకున్నాం. చిరుతను సురక్షితమైన ప్రాంతానికి తరలించి, తిరిగి అడవిలో వదిలేస్తామని డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి :

వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2026 | 12:17 PM