Share News

కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టొచ్చు

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:18 AM

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద రాష్ట్ర పోలీసులు కూడా వారిపై కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కేంద్ర ఉద్యోగుల అవినీతిపై రాష్ట్ర పోలీసులు కేసు పెట్టొచ్చు

  • సీబీఐ ముందస్తు అనుమతి అవసరం లేదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జనవరి 20: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లంచాలు తీసుకుంటే అవినీతి నిరోధక చట్టం కింద రాష్ట్ర పోలీసులు కూడా వారిపై కేసు పెట్టవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకు సీబీఐ నుంచి రాష్ట్ర పోలీసులు ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరమేమీ లేదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్‌ జె.బి.పార్డీవాలా, జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మల ధర్మాసనం తీర్పు చెప్పింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌-17 ప్రకారం రాష్ట్ర ఏజెన్సీ, కేంద్ర ఏజెన్సీతో పాటు ఏ ఇతర పోలీసు ఏజెన్సీ అయినా కేసు పెట్టవచ్చని తెలిపింది. అయితే ఒక స్థాయిగల అధికారికి మాత్రమే ఈ అధికారం ఉందని పేర్కొంది. పరిపాలనపరమైన సౌలభ్యం కోసం మాత్రమే కేంద్ర ఉద్యోగుల అవినీతి కేసులను సీబీఐకి అప్పగించారని, దానర్థం రాష్ట్రాల ఏసీబీ సంస్థలకు వారిపై అధికారం లేదని కాదని వివరణ ఇచ్చింది. అవినీతికి పాల్పడ్డ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిపై రాజస్థాన్‌ ఏసీబీ కేసుపెట్టడాన్ని సమర్థిస్తూ అక్కడి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఏకీభవించింది.

Updated Date - Jan 21 , 2026 | 07:06 AM