Share News

రాహుల్‌ దుబాయి పర్యటనకు ఏర్పాట్లు

ABN , Publish Date - Jan 21 , 2026 | 05:56 AM

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దుబాయి పర్యటనకు ఏర్పాట్లు ఊపందుకోనున్నాయి. వచ్చే నెలలో మూడు రోజుల పాటు ఆయన దుబాయిలో పర్యటించనున్నారు.

రాహుల్‌ దుబాయి పర్యటనకు ఏర్పాట్లు

  • వచ్చే నెల 14 నుంచి 16 వరకు పర్యటన

  • (ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ దుబాయి పర్యటనకు ఏర్పాట్లు ఊపందుకోనున్నాయి. వచ్చే నెలలో మూడు రోజుల పాటు ఆయన దుబాయిలో పర్యటించనున్నారు. అనుమతి లభించిన పక్షంలో పెద్దసంఖ్యలో కార్మికులతో సమావేశం కావడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది. మొదట వచ్చే నెల 13, 14, 15 తేదీల్లో రాహుల్‌ పర్యటిస్తారని భావించారు. దీని ప్రకారం 13న వచ్చి మరుసటి రోజు 14న (శనివారం) సభ నిర్వహించాలని అనుకున్నారు. అయితే 14న ఉన్నత, మధ్యతరగతి ఉద్యోగులకు మినహా కార్మికులు, సగటు ఉద్యోగులకు సెలవు లేనందున వారికి అనుకూలంగా 15న (వారాంతపు సెలవు దినమైన ఆదివారం) సభ నిర్వహించడానికి ప్రతిపాదించారు. దీంతో రాహుల్‌ 14న వచ్చి 16న తిరిగి వెళతారని పార్టీ నాయకులు చెప్పారు. ఇప్పటి వరకు నిర్ణయించిన ప్రకారం ఒక రోజు ఆబుధాబీకి వెళ్లి అధికార ప్రముఖులను కలుస్తారని, రెండు రోజులు దుబాయిలో ఉంటారని సమాచారం. ఇదిలా ఉండగా, ప్రస్తుతం అరబ్బు దేశాల్లోని పరిస్థితుల దృష్ట్యా రాహుల్‌ బహిరంగ సభకు అనుమతి దొరుకుతుందా లేదా అనే అనుమానాలున్నాయి.

Updated Date - Jan 21 , 2026 | 05:56 AM