ప్రపంచ ఆర్థిక సదస్సు.. ఒకే వేదికపై సీఎం రేవంత్‌రెడ్డితో చిరంజీవి
ABN , Publish Date - Jan 21 , 2026 | 11:12 AM
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో కలిసి మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. సీఎం పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంటర్నెట్ డెస్క్, జనవరి21 (ఆంధ్రజ్యోతి): స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు (Davos World Economic Forum) తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)తో కలిసి మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హాజరయ్యారు. సీఎం పర్యటన అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పర్యటనలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా చిరంజీవితో కలిసి ఆయన ఒకే వేదికపై కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రపంచ వేదికపై తెలంగాణ సత్తా..
ప్రపంచ ఆర్థిక వేదిక(WEF) వేదికగా తెలంగాణ తన సత్తా చాటుతోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధుల బృందం దావోస్‌లో పలు కీలక ఒప్పందాలు చేసుకోవడమే కాకుండా.. రాష్ట్ర భవిష్యత్తును ప్రతిబింబించే ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ డాక్యుమెంట్‌నూ ప్రపంచానికి పరిచయం చేసింది.

మెగాస్టార్ ప్రత్యేక ఆకర్షణ
జ్యూరిచ్‌లో పర్యటిస్తున్న మెగాస్టార్ చిరంజీవిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానించారు. సీఎం ఆహ్వానంతో దావోస్ సదస్సుకు హాజరయ్యారు చిరు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆయన ప్రత్యక్షంగా వీక్షించి, రాష్ట్ర అభివృద్ధిపై తన మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌తో కలిసి చిరంజీవి పలువురు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలతో ముచ్చటించారు.

సీఎం రేవంత్‌తో లోరియల్ సీఈవో భేటీ..
తెలంగాణ ఐటీ, పరిశ్రమల రంగంలో మరో భారీ విజయం నమోదైంది. ప్రపంచ ప్రసిద్ధ సౌందర్య సాధనాల సంస్థ లోరియల్ తన తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్(GCC)ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సీఎంతో లోరియల్ సీఈవో భేటీ అనంతరం ఈ ప్రకటన విడుదల చేశారు. ఈ ఏడాది నవంబర్‌లో ఈ సెంటర్ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇది హైదరాబాద్‌ను అంతర్జాతీయ బ్యూటీ టెక్ హబ్‌గా మార్చే అవకాశముంది.

తెలంగాణ రైజింగ్ 2047 కీలక అంశాలు
ముఖ్యమంత్రి రేవంత్.. దావోస్‌లో తెలంగాణ రైజింగ్ విజన్ ప్రదర్శించారు. 2047 నాటికి రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే దీని ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసం Core, Pure, Rare, Growth జోన్లను ప్రతిపాదించారు. గతంలో జరిగిన రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఇప్పటికే రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు సీఎం వెల్లడించారు.
ముఖ్య ప్రాజెక్టులైన హైదరాబాద్ మెట్రో విస్తరణ, మూసీ నది పునరుజ్జీవనం, చెరువుల పునరుద్ధరణపై గ్లోబల్ లీడర్లకు మఖ్యమంత్రి వివరించారు.

నూతన పాలసీల ఆవిష్కరణ
సాంకేతిక, వైద్య రంగాల్లో తెలంగాణను అగ్రస్థానంలో నిలిపేందుకు రెండు కీలక విభాగాలను సీఎం ప్రారంభించారు.
తెలంగాణ AI ఇన్నోవేషన్ హబ్: కృత్రిమ మేథ(Artificial Intelligence) రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు దీనిని ప్రారంభించారు.
నెక్స్ట్ జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030: 2030 నాటికి లైఫ్ సైన్సెస్ రంగాన్ని 250 బిలియన్ డాలర్ల స్థాయికి చేర్చడమే ఈ పాలసీ లక్ష్యమని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
ఒప్పందాలు, భవిష్యత్తు ప్రణాళిక..
దావోస్ పర్యటనలో గూగుల్, సేల్స్‌ఫోర్స్, యూనిలీవర్ వంటి దిగ్గజ సంస్థలతో రేవంత్ రెడ్డి కీలక చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్‌లో ఫాలోఅప్ ఫోరమ్ నిర్వహించాలని ముఖ్యమంత్రి అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాజకీయ, సినీ రంగ దిగ్గజాలు ఒకే వేదికపై కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేయడం శుభపరిణామం. మెగాస్టార్ చిరంజీవి కూడా భాగస్వామి కావడం వల్ల ఈ పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
బేగంపేట ఫ్లైఓవర్‌పై ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడిన కారు
మేడారం మహాజాతరలో నేడు తొలి ఘట్టం..
Read Latest Telangana News And Telugu News