దావోస్‌లో రెచ్చిపోయిన కేటుగాళ్లు.. నకిలీ వీఐపీ పాస్‌లతో బురిడీ!
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:44 PM
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు-2026లో కేటుగాళ్లు రెచ్చిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొననున్న సమావేశానికి నకిలీ వీఐపీ పాసులను విక్రయించి.. బిలియనీర్లను బురిడీ కొట్టించారు.
ఇంటర్నెట్ డెస్క్: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు-2026 జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సదస్సులో కేటుగాళ్లు రెచ్చిపోయారు. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పాల్గొననున్న కీలక వేదికను మోసగాళ్లు టార్గెట్ చేసుకున్నారు. ట్రంప్‌తో భేటీ అయ్యేందుకు యూఎస్ఏ హౌస్‌కు ప్రవేశం కల్పిస్తామంటూ పలువురు వ్యాపార వేత్తలకు, బిలియనీర్లకు నకిలీ వీఐపీ పాస్‌లు విక్రయించారు కేటుగాళ్లు.
అయితే.. అధికారుల తనిఖీల్లో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సందర్శకులు ఇలాంటి పాస్‌లు కొనవద్దని దావోస్ సదస్సు నిర్వాహకులు హెచ్చరించారు. ఈ ఏడాది దావోస్ సదస్సులో నకిలీ వీఐపీ పాస్‌లు ఎక్కువగా అమ్ముడుపోయాయని నిర్వాహకులు పేర్కొన్నారు. పలు దేశాల అధినేతలతో కలవాలనే బిలియనీర్ల బలహీనతను కొందరు కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుని మోసాలకు పాల్పడుతున్నారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్