నాలుగో బిడ్డకు తండ్రి కానున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ..
ABN , Publish Date - Jan 21 , 2026 | 12:11 PM
అమెరికా రాజకీయాల్లో వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్‌కి ఒక ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. ఇటీవల జేడీ వాన్స్ దంపతులపై ఎన్నో పుకార్లు వచ్చాయి. ఆ పుకార్లకు చెక్ పెడుతూ ఈ దంపతులు ఒక శుభవార్త చెప్పారు. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా (America) ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతులు శుభవార్త (Good news) చెప్పారు. ఈ ఏడాది జూలై చివరి వారం నాటికి మా ఇంటికి కొత్త అతిథి రాబోతున్నాడు, బాబు పుట్టబోతున్నాడని తెలిపారు. ఈ అద్భుతమైన సందర్భంలో తన కుటుంబానికి అండగా నిలుస్తున్న వారు, దేశం కోసం అహర్శిశలు శ్రమిస్తున్న సిబ్బంది, తమకు వైద్య సేవలు అందిస్తున్న మిలిటరీ వైద్యులకు జేడీ వాన్స్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతిష్టాత్మకమైన యేల్ లా స్కూల్ (Yale Law School)లో జేడీ వాన్స్, భారతీయ మూలాలు ఉన్న ఉష చిలుకూరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. పెద్దల అంగీకారంతో 2014లో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇప్పటికే ముగ్గురు సంతానం. వారిలో ఇద్దరు కుమారులు ఇవాన్, వివేక్.. ఒక కుమార్తె అమల్
ఉన్నారు. జేడీ వాన్స్ రాజకీయ ప్రస్థానంలో ఉష కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
వచ్చే ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు కొత్త సిలబస్
Read Latest Telangana News and National News