Share News

ప్రేమించాడని కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:03 PM

నర్సాపూర్ అటవీ ప్రాంతంలో ఓ యువకుడిపై దాడి ఘటన కలకలం రేపుతోంది. సదరు యువకుడికి ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బస్టాప్‌లో ఉన్న ఇద్దరిని గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా కారులో తీసుకెళ్లారు.

ప్రేమించాడని కారులో బలవంతంగా తీసుకెళ్లి... ఆపై
Medak News

మెదక్, జనవరి 21: నర్సాపూర్ మండలం చాకరిమెట్ల అటవీ ప్రాంతంలో దారుణ సంఘటన జరిగింది. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సూరయికుంట తండాకు చెందిన ధన్‌సింగ్ అనే యువకుడిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు విచక్షణా రహితంగా దాడి చేశారు. యువకుడిపై దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తోంది. సంగారెడ్డి జిల్లా కంది మండలం బ్యాతోల్ గ్రామానికి చెందిన ఓ యువతితో ధన్‌సింగ్‌కు ప్రేమ వ్యవహారం ఉంది. నర్సాపూర్ బస్టాండ్ వద్ద ప్రేమజంట ఉన్న సమయంలో కొందరు దుండగులు అక్కడకు వచ్చి.. అమ్మాయితో పాటు యువకుడినీ కారులో బలవంతంగా తీసుకెళ్లారు.


ఆపై.. చాకరిమెట్ల అటవి ప్రాంతంలో యువకుడిపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. దుండగుల దాడిలో ధన్‌సింగ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై యువకుడి కుటుంబ సభ్యులు నర్సాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

యువకుడిపై దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించారు పోలీసులు. అయితే యువకుడిపై దాడికి పాల్పడింది ఎవరు? ప్రేమ వ్యవహారమే కారణమా.? లేక ఇంకేదైనా ఉందా.? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ కేసును త్వరలోనే ఛేదించి నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు.


ఇవి కూడా చదవండి...

ఈ సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ విచారణ ఎందుకు?: కవిత సూటి ప్రశ్న

తెలంగాణకు 1,000 కోట్ల పెట్టుబడులు.. దావోస్‌లో సర్కార్ కీలక ఒప్పందం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 06:47 PM