Share News

ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి విలువ.. డాలర్‌తో పోలిస్తే 91.74గా నమోదు

ABN , Publish Date - Jan 21 , 2026 | 04:19 PM

అంతర్జాతీయ మార్కెట్లో డాలరుతో రూపాయి మారకం విలువ ఇవాళ ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 91.74గా నమోదైంది. జనవరి ప్రారంభం నుంచి రూపాయి విలువ దాదాపు 1.9 శాతం మేర పడిపోయింది.

ఆల్‌టైమ్‌ కనిష్ఠానికి రూపాయి విలువ..  డాలర్‌తో పోలిస్తే 91.74గా నమోదు
Rupee vs Dollar

ఆంధ్రజ్యోతి, జనవరి 21: అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ ఇవాళ(2026 జనవరి 21) ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 91.74గా నమోదైంది. ఈ ఉదయం ట్రేడింగ్‌లో రూపాయి మారకపు విలువ 91.20 వద్ద ప్రారంభమై.. మధ్యాహ్నానికి 91.74 వరకు పడిపోయింది. మునుపటి కనిష్ఠ రికార్డు(డిసెంబర్ 2025లో సుమారు 91.14 – 91.55 మధ్య) కంటే ఇది మరింత తక్కువ. ఇటీవలి కాలంలో మన రూపాయి వరుసగా బలహీనపడుతోంది. జనవరి ప్రారంభం నుంచి దాదాపు 1.9 శాతం పడిపోయింది. ఇవాళ్టి మార్కెట్ వాల్యూ ప్రకారం ఒక్క అమెరికన్ డాలర్ పెడితే, మన డబ్బు రూ. 91.74లు వస్తాయన్నమాట.


ఎందుకు ఇంత పడిపోతోంది?

ప్రధాన కారణాలు: విదేశీ ఇన్వెస్టర్లు(FPIలు) భారీగా భారత్ నుంచి నిధుల ఉపసంహరణ చేస్తున్నారు. జనవరిలో ఇప్పటికే బిలియన్ల డాలర్లు వెనక్కి తీసుకెళ్లారు.

అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడం, ట్రంప్ ప్రభుత్వం.. గ్రీన్‌లాండ్ వివాదం, టారిఫ్ బెదిరింపులు వంటి జియోపొలిటికల్ టెన్షన్లు.

గ్లోబల్ రిస్క్ పెరగడంతో సేఫ్-హెవెన్ అసెట్‌గా డాలర్ బలపడుతోంది. దిగుమతులకు(ముఖ్యంగా ఆయిల్, మెటల్స్) డాలర్ డిమాండ్ ఎక్కువగా ఉండటం కూడా కారణంగా భావిస్తున్నారు.


ప్రభావం ఏమిటి?

  • దిగుమతి వస్తువులు(ఎలక్ట్రానిక్స్, ఆయిల్, గోల్డ్) ఎక్కువ ఖరీదవుతాయి.

  • విదేశీ ప్రయాణాలు, చదువులు, రెమిటెన్స్(ఫారెన్ ఎక్స్‌ఛేంజ్ మార్జిన్) ఖర్చు పెరుగుతుంది.

  • ఎక్స్‌పోర్టర్లకు కొంత లాభం కలగవచ్చు. కానీ, మొత్తంగా మన ఎకానమీపై ఒత్తిడి పెరుగుతుంది.


ఇవి కూడా చదవండి..

కాకినాడ పీబీసీ కాల్వలో స్పిరిట్ లారీ బోల్తా.. ప్రజలకు అధికారుల హెచ్చరికలు

భారత్, ఇజ్రాయెల్ ఆర్థిక సహకారానికి దావోస్ వేదిక: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 21 , 2026 | 04:58 PM