IND vs NZ: న్యూజిలాండ్ టార్గెట్ ఎంతంటే..
ABN , Publish Date - Jan 21 , 2026 | 09:08 PM
న్యూజిలాండ్ జట్టుతో జరుగుతోన్న తొలి టీ20 క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు భారీ విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. న్యూజిలాండ్ జట్టు మ్యాచ్ గెలవాలంటే ప్రతీ ఓవర్ కు దాదాపు 12 పరుగులు చేయాల్సిన పరిస్థితిని భారతజట్టు న్యూజిలాండ్ ముందుంచింది.
ఆంధ్రజ్యోతి, జనవరి 21: భారత్-న్యూజిలాండ్ మధ్య ఇవాళ(బుధవారం) జరుగుతోన్న తొలి టీ20 మ్యాచ్ లో భారత జట్టు 239 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. భారత జట్టులో ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లో 84 పరుగులు సాధించాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 22 బంతుల్లో 32 పరుగులు, హార్థిక్ పాండ్య 16 బంతుల్లో 25, రింకు సింగ్ 20 బాల్స్‌లో 44 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచి భారత్ భారీ స్కోర్ చేసేందుకు కారణమయ్యాడు.
నాగ్‌పూర్ లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతోన్న మొదటి T20 ఇంటర్నేషనల్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో పరుగుల వరద పారింది. న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో ఇండియా తొలుత బ్యాటింగ్ చేసింది. భారత్ సాధించిన 238 పరుగులు న్యూజిలాండ్‌పై ఇండియా సాధించిన అత్యధిక T20I స్కోర్ కావడం విశేషం.
ఇండియా ఇన్నింగ్స్ వికెట్ల పతనం (Fall of Wickets):
18/1 (సంజు సామ్సన్, 1.5 ఓవర్లు)
27/2 (ఇషాన్ కిషన్, 2.5 ఓవర్లు)
126/3 (సూర్యకుమార్ యాదవ్, 10.4 ఓవర్లు)
149/4 (అభిషేక్ శర్మ, 11.6 ఓవర్లు)
166/5 (శివమ్ దూబే, 13.4 ఓవర్లు)
185/6 (హార్దిక్ పాండ్యా, 15.4 ఓవర్లు)
209/7 (అక్షర్ పటేల్, 17.5 ఓవర్లు)
న్యూజిలాండ్ బౌలర్ల ప్రదర్శన:
జాకబ్ డఫీ: 4 ఓవర్లు – 27 రన్స్ – 2 వికెట్లు (ఎకానమీ 6.75)
ఇష్ సోధి: 4 ఓవర్లు – 54 రన్స్ – 2 వికెట్లు (13.50)
క్రిస్టియన్ క్లార్క్: 3 ఓవర్లు – 37 రన్స్ – 1 వికెట్
ఇక, టిమ్ సౌథీ, కైల్ జామిసన్, మిచెల్ సాంట్నర్ వంటి బౌలర్లు భారీగానే పరుగులు సమర్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..