Share News

బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్నారు...

ABN , Publish Date - Jan 21 , 2026 | 10:30 AM

బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించేవారిని అరెస్టులు, దాడులతో భయపెడుతున్నారని ఆయన విమర్శించారు.

బీఆర్‌ఎస్‌ నేతలను వేధిస్తున్నారు...

- ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

హైదరాబాద్: అధికారాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పెద్దలు బీఆర్‌ఎస్‌ నేతలను వేధింపులకు గురిచేస్తున్నారని ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీష్‏రావుకు సిట్‌ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌కు వెళ్లి హరీష్‏రావు(Harish Rao)కు సంఘీభావం తెలిపారు.


city6.2.jpg

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏమీ లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చినప్పటికీ మళ్లీ నోటీసులిచ్చి విచారణకు రమ్మనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీస్‌ యంత్రాంగం సర్కార్‌ అడుగులకు మడుగులొత్తుతోందని ఆయన మండిపడ్డారు. భవిష్యత్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.


city6.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి.

వచ్చే ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌కు కొత్త సిలబస్‌

ముంచుకొస్తోంది ముహూర్తాల వేళ!

Read Latest Telangana News and National News

Updated Date - Jan 21 , 2026 | 10:30 AM