Share News

వీధి కుక్కల హత్యలపై యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ABN , Publish Date - Jan 21 , 2026 | 02:08 PM

రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామంలో సుమారు వందకు పైగా వీధి కుక్కలకు విషం పెట్టి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే...

వీధి  కుక్కల హత్యలపై యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
Street Dogs Poisoned Telangana

రంగారెడ్డి జిల్లా, జనవరి 21: ఇటీవల దేశ వ్యాప్తంగా వీధి కుక్కలపై దాడులు, వాటిని హతమార్చడం వంటి ఘటనలు తరచూ వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ ఘటనలపై పలుచోట్ల యానిమల్ లవర్స్ ఫిర్యాదులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా.. వీధి కుక్కలను హతమార్చిన ఘటనపై యాచారం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సదరు గ్రామ పంచాయతీ పరిధిలో సోమవారం సుమారు 100 వీధి శునకాలను హతమార్చిన విషయం స్థానికంగా చర్చనీయాంశమైంది.


ఈ ఘటనపై ఢిల్లీకి చెందిన ‘స్ట్రే యానిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా’ వీధి కుక్కల సంరక్షణ ప్రతినిధులు యాచారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ నందీశ్వర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల కామారెడ్డి, హన్మకొండ జిల్లాల్లోనూ వరుసగా కుక్కలను హతమార్చుతున్న వార్తలపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

ఈనెల 26 నుంచి ఫిబ్రవరి 1 వరకు విశాఖ ఉత్సవ్: హోంమంత్రి అనిత

మదర్ ఆఫ్ ఆల్ డీల్స్.. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ఈయూ చీఫ్

Updated Date - Jan 21 , 2026 | 03:03 PM