యూరప్ సరైన దిశలో వెళ్లడం లేదు.. దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరంలో ట్రంప్
ABN , Publish Date - Jan 21 , 2026 | 07:57 PM
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో ట్రంప్ మరోసారి అమెరికా ఫస్ట్ నినాదాన్ని గుర్తుచేస్తూ, అమెరికా అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
దావోస్: యూరప్ సరైన దిశలో వెళ్లడం లేదని, తన పాలనను చూసి యూరప్ నేర్చుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో ఆయన మరోసారి అమెరికా ఫస్ట్ నినాదాన్ని గుర్తుచేస్తూ, అమెరికా అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని తగ్గించామని, వాణిజ్య లోటును 77 శాతానికి తగ్గించామని ట్రంప్ చెప్పారు. అమెరికాకు 200 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు వచ్చాయన్నారు. గత ఏడాది స్టాక్ మార్కెట్లు కూడా రికార్డు సృష్టించాయని పేర్కొన్నారు. తన పాలనలో అమెరికన్లు సంతోషంగా ఉన్నట్టు చెప్పారు. అమెరికాను ప్రపంచానికి గ్రోత్ ఇంజన్‌గా అభివర్ణించారు.
'ఎంతో అందమైన దావోస్‌లో అనేక మంది వాణిజ్య ప్రముఖులు, మిత్రులు, కొద్దిమంది శత్రువులను కలవడం సంతోషంగా ఉంది' అంటూ ఉపన్యాసం ప్రారంభంలో ట్రంప్ ఛలోక్తులు విసిరారు. ఆ వెంటనే అమెరికా సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూనే యూరోప్‌పై విమర్శలు గుప్పించారు. యూరప్ సరైన దిశలో వెళ్లడం లేదని తప్పుపట్టారు. అమెరికాకు, యూరోపియన్ యూనియన్‌కు మధ్య విభేదాలకు కారణమవుతున్న గ్రీన్‌లాండ్‌ను 'బిగ్, బ్యూటిఫుల్ పీస్ ఆఫ్ ఐస్' అని అభివర్ణించారు. అమెరికా మినహా గ్రీన్‌లాండ్‌ను డిఫెండ్ చేయగలిగిన దేశం మరొకటి లేదని, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా గ్రీన్‌లాండ్‌ను తిరిగి ఇవ్వడం తెలివితక్కువతనమని వ్యాఖ్యానించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గ్రేట్ దావోస్ డివోర్స్.. ట్రంప్ గ్రీన్‌లాండ్ ఎత్తుగడలకు ముగింపు పలకాలని మిత్రదేశాలు నిర్ణయం
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..