Home » Switzerland
స్విట్జర్లాండ్‌లో జరిగిన ఇరాన్-యూఎస్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిన పాకిస్థాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' వ్యూహాత్మక దాడికి ప్రణాళిక రచించిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇరాన్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన 14 అంశాల అవగాహనా ఒప్పందాన్ని పూర్తిగా అమలు చేయడానికి రాబోయే 60 రోజుల్లో సాంకేతిక వివరాలను ఖరారు చేయాల్సి ఉంది. అందులో భాగంగా ఇవాళ స్విట్జర్లాండ్‌లో మొదటి విడత చర్చలు ప్రారంభమయ్యాయి.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారంనాడు ట్రంప్ పాల్గొని ప్రసంగించారు. భారత్-పాక్ మధ్య గత ఏడాది జరిగిన ఘర్షణలతో సహా 8 యుద్ధాలను తాను అడ్డుకున్నానని మరోసారి ఆయన తెలిపారు.
దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం వార్షిక సదస్సులో ట్రంప్ మరోసారి అమెరికా ఫస్ట్ నినాదాన్ని గుర్తుచేస్తూ, అమెరికా అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు.
స్విట్జర్లాండ్ రాయబారి మాయా తిస్సాఫీ సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో ఎంపీ రఘువీర్, రీజనల్ పాస్‌పోర్టు అధికారి స్నేహజ, మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు
గోల్కొండ గనుల్లో దొరికిన అరుదైన ‘గోల్కొండ బ్లూ’ వజ్రం మే 14న జెనీవాలో వేలంకి రానుంది 23.24 కేరట్ల ఈ నీలి వజ్రానికి రూ.430 కోట్ల వరకూ ధర పలికే అవకాశం ఉంది
దావోస్‌లో ఉక్కు దిగ్గజం లక్ష్మీమిట్టల్‌తో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ భావనపాడులో పెట్రో కెమికల్ హబ్ ఏర్పాటుకు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీలో సోలార్ సెల్ తయారు ప్లాంటు ఏర్పాటును పరిశీలించాలని లక్ష్మీ మిట్టల్‌ను కోరారు.
ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు.
మళ్లీ జన్మంటూ ఉంటే తెలుగుజాతిలోనే పుట్టాలని భగవంతుడిని కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
సంక్రాంతి సందర్భంగా స్విట్జర్లాండ్ తెలుగు ఎన్నారై ఫోరమ్ ప్రత్యేక ప్రొగ్రామ్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలో స్విట్జర్లాండ్‌లో మొట్టమొదటి ఫ్రాంచైజీ ఆధారిత క్రికెట్ లీగ్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..