పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌పై ‘మొసాద్’ దాడికి ప్లాన్? బ్రెజిల్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు!
ABN , Publish Date - Jun 25 , 2026 | 09:15 AM
స్విట్జర్లాండ్‌లో జరిగిన ఇరాన్-యూఎస్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిన పాకిస్తాన్ సైన్యాధిపతి, ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' వ్యూహాత్మక దాడికి ప్రణాళిక రచించిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇస్లామాబాద్/జెనీవా, జూన్ 25: అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రేపే వార్త వెలుగులోకి వచ్చింది. స్విట్జర్లాండ్‌లో జరిగిన ఇరాన్-యూఎస్ శాంతి చర్చల్లో పాల్గొనేందుకు వెళ్లిన పాకిస్తాన్ సైన్యాధిపతి (ఆర్మీ చీఫ్) ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్‌ను లక్ష్యంగా చేసుకుని, ఇజ్రాయెల్ గూఢచార సంస్థ 'మొసాద్' (Mossad)ఓ వ్యూహాత్మక దాడికి ప్రణాళిక రచించిందనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ బ్రెజిలియన్ జర్నలిస్ట్, భౌగోళిక రాజకీయ విశ్లేషకుడు పేపే ఎస్కోబార్ (Pepe Escobar) ఒక ఇంటర్వ్యూలో ఈ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు మారియో నౌఫల్‌తో 'X' (సోషల్ మీడియా మాధ్యమం) వేదికగా జరిగిన ఓ సంభాషణలో పేపే ఎస్కోబార్ ఈ విషయాలను వెల్లడించారు. 'ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆదేశాల మేరకు, స్విట్జర్లాండ్ వెళ్తున్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ ప్రతినిధి బృందాన్ని లక్ష్యంగా చేసుకుని మొసాద్ ఒక హత్యాయత్నానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే, ఈ ప్లాన్‌కు సంబంధించిన అత్యంత విశ్వసనీయ సమాచారాన్ని పాకిస్తాన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టి, అడ్డుకుంది,' అని ఎస్కోబార్ పేర్కొన్నారు.
ఇజ్రాయెల్‌కు పాక్ తీవ్ర హెచ్చరిక?
ఈ కుట్ర గురించి తెలిసిన వెంటనే పాకిస్తాన్ దౌత్యపరమైన మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్‌కు నేరుగా, అత్యంత కఠినమైన సందేశాన్ని పంపినట్లు ఎస్కోబార్ చెప్పుకొచ్చారు. 'మాకు అందిన సమాచారం ప్రకారం.. పాకిస్తాన్ (బహుశా ఒమన్ మధ్యవర్తిత్వంతో) ఇజ్రాయెల్‌కు నేరుగా వార్నింగ్ ఇచ్చింది. 'ఒకవేళ మీరు మా ప్రతినిధి బృందాన్ని తాకితే, మేము మిమ్మల్ని ప్రపంచ పటం నుంచే తుడిచేస్తాము' అని పాక్ గట్టిగా హెచ్చరించింది' అని ఆయన వ్యాఖ్యానించారు.
అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు
ఈ హత్యాయత్నం, బెదిరింపుల ఆరోపణలపై ఇటు ఇజ్రాయెల్ కానీ, అటు పాకిస్తాన్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అలాగే సదస్సు జరిగిన స్విట్జర్లాండ్ భద్రతా సంస్థలు గానీ, అమెరికా గానీ ఈ రకమైన ముప్పుపై ఎలాంటి బహిరంగ అలర్ట్‌లను జారీ చేయకపోవడం గమనార్హం.
కాగా, అమెరికా - ఇరాన్ దేశాల మధ్య శాంతి ప్రయత్నాలలో భాగంగా గత వారం స్విట్జర్లాండ్‌లోని ముంగెన్‌స్టాక్‌లో జరిగిన చర్చల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో కూడిన ఉన్నత స్థాయి బృందం అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలోనే ఈ హై-డ్రామా జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఆరోపణలు ఎంతవరకు నిజమనేది పక్కన పెడితే, ప్రస్తుతం అంతర్జాతీయ డిప్లొమాటిక్ వర్గాల్లో మాత్రం ఇది తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవల కాలంలో ఇజ్రాయెల్- పాకిస్తాన్ మధ్య అంతర్గతంగా తీవ్ర ఉద్రిక్తతలు నడుస్తున్నాయని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
సంపులో పడి చిన్నారి మృతి.. తట్టుకోలేక నాయనమ్మ కన్నుమూత!
టీమిండియాతోనే పయనం.. కానీ మ్యాచ్‌కు ముందు వైభవ్‌కు ప్రత్యేక రూమ్!