Share News

రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు..

ABN , Publish Date - Aug 30 , 2026 | 01:08 PM

స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ రేవ్ పార్టీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రేవ్ పార్టీలో పాల్గొన్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

రేవ్ పార్టీలో కాల్పులు.. ఒకరి మృతి, ఐదుగురికి గాయాలు..
Switzerland shooting

ఇంటర్‌నెట్ డెస్క్: స్విట్జర్లాండ్‌లో జరిగిన ఓ రేవ్ పార్టీలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రేవ్ పార్టీలో పాల్గొన్న వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. జూరిచ్‌లోని ఆరావులో శనివారం రాత్రి భారీ రేవ్ పార్టీ జరిగింది. ఈ పార్టీలో 3500 మంది పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి పార్టీలోని వారిపై కాల్పులకు తెగబడ్డాడు.


కాల్పుల అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం ఆర్గావ్ కాంటోనల్ పోలీసులు భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. సైనిక హెలికాప్టర్లను రంగంలోకి దించడంతో పాటు, ఘటనా స్థలానికి సుదూర ప్రాంతాల్లోనూ సాయుధ పోలీసులను మోహరించారు.


ఇవి కూడా చదవండి

దులీప్ ట్రోఫీ: 15 ఏళ్లకే సంచలనం.. కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ

భలే బ్యాక్‌ప్యాక్‌...

Updated Date - Aug 30 , 2026 | 01:15 PM