Chandrababu: సత్యసాయి శత జయంతి ఉత్సవాలు.. హాజరైన సీఎం చంద్రబాబు
ABN, Publish Date - Nov 23 , 2025 | 11:13 AM
భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం పుట్టపర్తి పట్టణంలోని హిల్ వ్యూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సత్యసాయి సమాధిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా,నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): భగవాన్ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ(ఆదివారం) పుట్టపర్తి పట్టణంలోని హిల్ వ్యూ స్టేడియంలో అద్భుత ఏర్పాట్లతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సత్యసాయి బాబా జీవిత చరిత్ర, మహిమలు, తదితర ముఖ్య ఘట్టాలను డిజిటల్ స్క్రీన్స్ ద్వారా ప్రదర్శనలు నిర్వహించారు. సాయి నామ సంకీర్తనామావళి, సాంస్కృతిక, సంగీత కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వివిధ రాష్ట్రాల సాయిభక్త బృంద ప్రదర్శనలు అలరించాయి. ఆదివారం సత్యసాయి సమాధిని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
Updated Date - Nov 23 , 2025 | 11:14 AM