Harish Rao: అంబేద్కర్ ముందు చూపు వల్లే తెలంగాణ
ABN, Publish Date - May 26 , 2025 | 09:24 PM
భారతదేశం అంతర్ యుద్ధం లేకుండా ఉంది అంటే అంబేద్కర్ ముందు చూపు వల్లే సాధ్యమైందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. బడుగు, బలహీనవర్గాల్లోని ప్రజలకు అంబేద్కర్ తన చదువును ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ దారి చూపించారని హరీష్‌రావు చెప్పారు.
సిద్దిపేట: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ (Ambedkar) ముందు చూపు వల్లే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (Harish Rao) తెలిపారు. ఇవాళ(సోమవారం) చిన్నకోడూరు మండలం చెర్ల అంకిరెడ్డిపల్లిలో అంబేద్కర్ విగ్రహన్ని హరీష్‌రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, ప్రపంచానికి మార్గదర్శకంగా భారతదేశం నిలిచింది అంటే అంబేద్కర్ ఘనత వల్లేనని ఉద్ఘాటించారు. అంబేద్కర్ చీకట్లో ఉన్న వారికి దారి చూపించి వెలుగులు నింపారని హరీష్‌రావు చెప్పారు.
బడుగు, బలహీనవర్గాల్లోని ప్రజలకు తన చదువును ఉపయోగించి భారత రాజ్యాంగాన్ని రచించి అందరికీ అంబేద్కర్ దారి చూపించారని మాజీమంత్రి హరీష్‌రావు చెప్పారు. భారతదేశం అంతర్ యుద్ధం లేకుండా ఉంది అంటే అంబేద్కర్ ముందు చూపు వల్లే సాధ్యమైందని గుర్తుచేశారు. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాల్లో మొన్నటి వరకు ప్రజలకు ఓటు హక్కు లేదని చెప్పుకొచ్చారు. భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలోనే చిన్న, పెద్ద, కుల, మతాలు అనే తారతమ్యం లేకుండా మహిళలకు పురుషులకు ఓటు హక్కును అంబేద్కర్ కల్పించారని మాజీమంత్రి హరీష్‌రావు ఉద్ఘాటించారు.
75 ఏళ్ల క్రితం ఇలాంటి సమస్యలు వస్తాయనే అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని ఆర్టికల్ 3ను అంబేద్కర్ పొందుపరిచారని మాజీమంత్రి హరీష్‌రావు అన్నారు. సమాజంలో తారతమ్యం పోవాలంటే చదువు చాలా ముఖ్యమని చెప్పారు. ఉన్నత చదువులు చదువుకున్న వారు ఇంటర్ క్యాస్ట్ వివాహాలు చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. మనం పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి చదువు మాత్రమేనని ఉద్ఘాటించారు. విద్య ఉద్యోగం కోసమే కాదని.. ఉన్నత విలువలతో జీవితాన్ని కొనసాగించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలను ప్రభుత్వ బడుల్లో, కొడుకులను ప్రైవేట్ బడుల్లో చదివిస్తున్నారని అన్నారు. పాకిస్తాన్‌పై యుద్ధంలో ఆడపిల్లలు పోరాడారని తెలిపారు. యూపీఎస్సీలో ఏ ఫలితాలు చూసినా ఆడపిల్లలదే హవా నడుస్తోందని హరీష్‌రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ఆ పోటీలకు కోట్లల్లో ఖర్చు.. మరి రైతులకు.. హరీష్ సూటి ప్రశ్న
బీజేపీని టార్గెట్ చేసిన కేటీఆర్.. వీడియోలతో సెటైర్లు
Read Latest Telangana News And Telugu News
Updated Date - May 26 , 2025 | 09:35 PM