ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Niranjan Reddy: పాలమూరు ప్రాజెక్ట్‌కి ద్రోహం చేస్తున్నారు.. రేవంత్ ప్రభుత్వంపై నిరంజన్ రెడ్డి ఫైర్

ABN, Publish Date - May 02 , 2025 | 02:12 PM

Niranjan Reddy: అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ ప్రభుత్వాన్ని భరించటం రాష్ట్ర ప్రజలకు శిక్ష అని నిరంజన్ రెడ్డి చెప్పారు.

Niranjan Reddy

హైదరాబాద్: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తయిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు ప్రాజెక్ట్ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. పాలమూరు వారైన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్ట్‌కు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ(శుక్రవారం) తెలంగాణ భవన్‌లో నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్ట్‌లో ఆంధ్రా ప్రాంతానికి చెందిన టీడీపీ నాయకుడికి టెండర్ దక్కిందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.


ఆయన పనులను ఎందుకు పూర్తి చేయలేదని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్ల అధినాయకుడి ఆజ్ఞలతో జాప్యం చేస్తున్నారా అని నిలదీశారు. నీటి పారుదలశాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్కువ ఖర్చుతో పూర్తి అయ్యే ప్రాజెక్ట్ డిజైన్‌లు మార్చి అంచనాలు పెంచారని ధ్వజమెత్తారు. రేవంత్ ప్రభుత్వం ప్రజాధనం వృథా చేస్తుందని విమర్శించారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రిపోర్ట్ గెజిట్ నోటిఫై చేయటం కోసం మే 7వ తేదీ సమావేశం ఉందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.


ట్రిబ్యునల్ రిపోర్ట్‌లో ఉమ్మడి రాష్ట్రాలకు 1050 టీఎంసీల నీళ్లు కేటాయించినట్టుగా తెలుస్తోందని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రిపోర్టును ప్రభుత్వం యథాతథంగా ఆమోదిస్తే తెలంగాణకు గొడ్డలి పెట్టు అని చెప్పారు. జూరాల ప్రాజెక్టు ద్వారా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్‌కు నీళ్లు వచ్చే పరిస్థితి ఉండదని అన్నారు. రుణమాఫీ కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెబుతున్నారని చెప్పారు. ఈ ఏడాది ధాన్యం ఎంత సేకరించారు...బోనస్ ఎంత ఇచ్చారని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం దారుణంగా వైఫల్యం చెందిందని అన్నారు. రేవంత్ ప్రభుత్వాన్ని భరించటం రాష్ట్ర ప్రజలకు శిక్ష అని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై అఖిల పక్షాన్ని బ్రిజేష్ కుమార్ సమావేశానికి పిలవాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి

Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..

Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం

డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం

Gold Smuggling: శంషాబాద్‌ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 06 , 2025 | 07:30 AM