Mahesh Goud: మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సీరియస్
ABN, Publish Date - Jun 16 , 2025 | 03:14 PM
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై పొంగులేటి ప్రకటనను టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. కేబినెట్ అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మహేష్‌కుమార్ మండిపడ్డారు.
హైదరాబాద్: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిపై (Minister Ponguleti Srinivas Reddy) టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Goud) సీరియస్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిన్న(ఆదివారం) పొంగులేటి ప్రకటన చేశారు. ఈ విషయంలోనే పొంగులేటిపై పీసీసీ చీఫ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రిజర్వేషన్ల అంశంతో ముడిపడిన ఎన్నికలపై పొంగులేటి ప్రకటనను టీపీసీసీ చీఫ్ తప్పుబట్టారు. కేబినెట్ అంశాలను ముందుగానే మీడియాతో మాట్లాడితే ఎలా అంటూ మండిపడ్డారు. ఒకరి మంత్రిత్వ శాఖపై మరొకరు మాట్లాడటమేంటని ప్రశ్నించారు. అధిష్టానంతో సంప్రదించకుండా ప్రకటనలు చేయొద్దని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ సూచించారు.
మరోవైపు.. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ రేపు(మంగళవారం) పోలీసులకు వాంగ్మూలం ఇవ్వనున్నారు. 2023 ఎన్నికల వేళ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మహేష్‌గౌడ్ పనిచేశారు. గత కేసీఆర్ ప్రభుత్వం తన ఫోన్ ట్యాపింగ్ చేసిందని మహేష్‌గౌడ్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
పొంగులేటి ఏమన్నారంటే..
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఈ నెలాఖరులోపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిపారు. త్వరలో ఎన్నికల తేదీల ప్రకటన ఉంటుందని అన్నారు. సోమవారం జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఓ నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, అనంతరం సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు ఉంటాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. అయితే పొంగులేటి అధిష్టానాన్ని సంప్రదించకుండా స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా మాట్లాడతారని టీపీసీసీ చీఫ్ మహేష్‌గౌడ్ ప్రశ్నించారు. ఇప్పుడు ఈ వ్యవహారం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ వార్తలు కూడా చదవండి
గోడలు దూకేందుకు బీజేపీ నేతల యత్నం.. జీహెచ్‌ఎంసీ వద్ద టెన్షన్ టెన్షన్
కొండపల్లి మున్సిపాలిటీ టీడీపీ కైవసం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jun 16 , 2025 | 03:55 PM