ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్.. పోలీసులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ABN, Publish Date - May 07 , 2025 | 02:06 PM

CM Revanth Reddy: ఆపరేషన్ సిందూర్‌ నేపథ్యంలో బుధవారం నాడు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు విభాగాల అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

CM Revanth Reddy

హైదరాబాద్: దేశ సైన్యంతో మనమంతా అండగా ఉన్నామనే సందేశం ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. ఈ సమయంలో రాజకీయాలు, పార్టీలకు తావులేదని స్పష్టం చేశారు. అత్యవసర సర్వీస్‌లు అందించే విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని ప్రకటించారు. ఉద్యోగులు అంతా ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని చెప్పారు. మంత్రులు, అధికారులు అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఇవాళ(బుధవారం) ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది.


ఈ నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, డీజీపీ జితేందర్,హోం సెక్రటరీ రవి గుప్తా, ఆర్మీ, పోలీస్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఇతర సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రజల రక్షణకు సంబంధించి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం(మే8) సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. సెక్రటేరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు,ఇతర నేతలు పాల్గొననున్నారు.


విదేశీ పర్యటనలు రద్దు చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ ఉద్యోగులు మీడియా, సోషల్ మీడియాలో అసవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండేలా టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వాలని అన్నారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపైన కఠినంగా వ్యవహరించాలని అన్నారు. బ్లడ్ బ్యాంకుల్లో రక్తనిల్వలు సిద్దం చేసుకోవాలని చెప్పారు. అత్యవసర మెడిసిన్ సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచించారు.


ప్రైవేటు ఆస్పత్రుల్లో బెడ్‌ల అందుబాటుపైన ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. రెడ్ క్రాస్ సమన్వయం చేసుకోవాలని అన్నారు. ఆహార నిల్వలు తగినంత ఉండేలా చూడాలని తెలిపారు. సైబర్ సెక్యూరిటీ మీద అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపైన ఉక్కు పాదం మోపాలని హెచ్చరించారు. ఫేక్ న్యూస్ వల్ల ప్రజల్లో మరింత ఆందోళన పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఫేక్ న్యూస్‌ను అరికట్టడానికి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో సీసీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ రూంకి అనుసంధానం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భధ్రతను పెంచాలని సూచించారు. హైదరాబాద్‌లోని అన్ని విదేశీ రాయబార కార్యాలయాల దగ్గర భధ్రతను పెంచాలని ఆదేశించారు. ఐటీ సంస్థల దగ్గర భద్రతను పెంచాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అవసరమైతే పీస్ కమిటీలతో మాట్లాడాలని సూచించారు. రౌడీ‌షీటర్‌లపైన, పాత నేరస్తుల పట్ల పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

India Pak War: పాకిస్తాన్‌పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..

భారత్ ఆపరేషన్‌ సింధూర్..

India Revenge On Pahalgam: పహల్గామ్‌కు భారత్ ప్రతీకారం.. ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 07 , 2025 | 02:56 PM