India Revenge On Pahalgam: పహల్గామ్‌కు భారత్ ప్రతీకారం.. ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి..
ABN , Publish Date - May 07 , 2025 | 07:25 AM
పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. అయితే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాలను భారతదేశం ఎలా ట్రాక్ చేసింది? ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పహల్గామ్‌కు భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ నేలమట్టం చేసింది. దాడిలో సుమారు 30 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. బుధవారం తెల్లవారుజామున భారత సాయుధ దళాలు బహవల్‌పూర్‌లోని జైష్-ఎ-మొహమ్మద్ బలమైన స్థావరం, మురిడ్కేలోని లష్కరే-ఎ-తోయిబా స్థావరంతో సహా తొమ్మిది ఉగ్రవాద లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయి. అయితే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు దాక్కున్న ప్రదేశాలను భారతదేశం ఎలా ట్రాక్ చేసింది? ఆపరేషన్ సిందూర్ విజయం వెనుక ఉన్న ఏజెన్సీ ఏంటి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో దాక్కున్న ఉగ్రవాదులను జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ (NTRO) గుర్తించింది. వారి స్థానాల గురించి నిఘా సమాచారాన్ని అందించింది. భారత దాడుల్లో అనేక మంది అగ్ర ఉగ్రవాద కమాండర్లు మరణించి ఉండవచ్చని భారత సైన్యం అంచనా వేస్తోంది.
NTRO అంటే ఏమిటి?
NTRO అనేది 2004లో స్థాపించబడిన భారతదేశ సాంకేతిక నిఘా సంస్థ. ఇది జాతీయ భద్రతా సలహాదారు (NSA), ప్రధాన మంత్రి కార్యాలయం (PMO) కింద పనిచేస్తుంది. అధునాతన సాంకేతిక నిఘాను సేకరించడం, భారతదేశ జాతీయ భద్రతను కాపాడటంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా ఉగ్రవాదం, సైబర్ బెదిరింపులు, సరిహద్దు ముప్పులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. NTRO అత్యాధునిక సాంకేతికత పరికరాలను ఉపయోగించడం వలన ఉగ్రవాదులను ట్రాక్ చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది.
Also Read:
India Pak War: పాకిస్తాన్‌పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..