ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి కీలక ఆదేశాలు

ABN, Publish Date - May 21 , 2025 | 04:11 PM

CM Revanth Reddy: తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులతో ముఖ్క్ష్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ముఖ్క్ష్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.

CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షం (Heavy Rain) పడుతోంది. వర్షం దంచికొడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ మేరకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) సంబంధిత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఇవాళ(బుధవారం) హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ ‌సెంటర్‌లో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.


ముందు జాగ్రత్తలు తీసుకోవాలి..

ఈ సందర్భంగా వర్షానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి సీఎం తెలుసుకున్నారు. మరో మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలో ఉన్న ధాన్యం తడవకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు ముఖ్యమంత్రి. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. హైదరాబాద్ సిటీలో వర్షం కురుస్తున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చూడాలని, ట్రాఫిక్ ఇబ్బందులు, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలని ఆదేశించారు సీఎం రేవంత్‌రెడ్డి. జీహెచ్ఎంసీ, పోలీస్​, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.


అన్ని శాఖలు అలర్ట్‌గా ఉండాలి..

అన్ని విభాగాలకు సీఎం రేవంత్‌రెడ్డి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. రుతుపవనాలు ముందుగా రాబోతున్నాయని, అన్ని శాఖలు అలర్ట్‌గా ఉండాలని సూచించారు. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. 2024లో కురిసిన భారీ వర్షాలకు ఎన్టీఆర్‌ఎఫ్ (NDRF) అందుబాటులో లేకపోవడంతో గోల్డెన్ అవర్ కోల్పోయామని చెప్పుకొచ్చారు. 2024 సెప్టెంబర్ లాంటి ఘటనలు మళ్లీ పునారావృతం కావొద్దని ఆదేశించారు. SDRF, TGSP బెటాలియన్ 12బృందాలు అందుబాటులో ఉన్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ఎఫ్ మూడు బృందాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. అన్ని జిల్లా కేంద్రాల్లో SDRF బృందాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. రంగారెడ్డి, జీహెచ్‌ఎసీలో హైడ్రా అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు.


సమన్వయం చేసుకోవాలి..

జిల్లాల్లో కలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు, సమన్వయం చేసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. సింగరేణిలో రెస్క్యూ టీమ్స్‌కు ప్రత్యేక ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో కంట్రోల్ రూమ్, SDRF, DFOతో కలెక్టర్ సమన్వయం చేసుకోవాలని సూచించారు. రెయిన్ అలర్ట్ సర్క్యూలర్‌ను అన్ని జిల్లా కలెక్టర్లకు, శాఖలకు డిజాస్టర్స్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ పంపించారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ఇచ్చిన సూచనలకు అనుగుణంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని రాష్ట్ర సీఎస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Uttam Kumar Reddy: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తప్పిన ప్రమాదం

CM Revanth Reddy: పాక్‌కి బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు..

Miss World contestants: రొమ్ము క్యాన్స‌ర్‌ అవగాహనలో మిస్ వరల్డ్ బ్యూటీస్ తోడ్పాటు

Heavy Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

Read latest Telangana News And Telugu News

Updated Date - May 21 , 2025 | 06:09 PM