Share News

Heavy Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

ABN , Publish Date - May 21 , 2025 | 02:25 PM

Heavy Rain: హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతోంది. వాన దంచికొడుతుండటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Heavy Rain: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
Heavy Rain in Hyderabad

హైదరాబాద్‌: భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో వర్షం (Heavy Rain) దంచికొడుతోంది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి తీవ్రమైన ఎండ ఉండగా వాతావరణం ఒక్కసారిగా మారి భారీ వర్షం పడుతోంది. వర్షం ధాటికి లోతట్టు ప్రాంతాలతో పాటు రహదారులు జలమయమవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాతబస్తీతో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది.


నగరంలోని మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కొత్తపేట, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి, మారేడుపల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, లక్డీకపూల్, ఫిలింనగర్, బోరబండ, యూసఫ్‌గూడా, తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా వర్షం పడుతోంది. వర్షం ధాటికి కరెంట్ సరఫరా నిలిచిపోయింది. మ్యాన్‌హోళ్లు పొంగిపోర్లుతుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.


పలు జిల్లాల్లో భారీ వర్షం

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం దంచికొడుతోంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్, నెల్లికుదురు, ఇనుగుర్తి, బయ్యారం, డోర్నకల్, మరిపెడ, నర్సంపేట, నర్సింహులపేటలో భారీ వర్షం కురుస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా వాతావరణం మేఘావృతమైంది. భారీ వర్షం కురుస్తోండటంతో ఎండల నుంచి ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్, కోదాడ, నల్లబండగూడెం, హుజూర్‌నగర్, చింతలపాలెం, మేళ్లచెరువు మండలాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతోంది. సూర్యాపేట జిల్లాలోని నల్లబండగూడెం సమీపంలో ఓ చెట్టు కింద మేకల మందపై పిడుగు పడటంతో 39 మేకలు మృతిచెందాయి. అయితే మరో ఐదు రోజులు భారీ వర్షసూచన ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈరోజు, రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Vizianagaram Terror Suspects: ఉగ్రలింకుల కేసులో ఎన్‌ఐఏ దూకుడు

Miss World contestants: రొమ్ము క్యాన్స‌ర్‌ అవగాహనలో మిస్ వరల్డ్ బ్యూటీస్ తోడ్పాటు

Read latest Telangana News And Telugu News

Updated Date - May 21 , 2025 | 03:16 PM