CM Revanth Reddy: పాక్‌కి బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు..
ABN , Publish Date - May 21 , 2025 | 01:15 PM
CM Revanth Reddy: భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్థంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.
హైదరాబాద్, మే 21: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకుని పడుకున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాము బయటకు వచ్చి కేంద్రానికి అండగా ఉన్నామని ప్రకటించి.. మద్దతు తెలిపామని ఆయన గుర్తు చేశారు. ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించని వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారంటూ కిషన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన చేతగానితనాన్ని కప్పి పుచ్చుకునేందుకే రాహుల్ గాంధీపై కిషన్ రెడ్డి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బుధవారం మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ 34వ వర్థంతి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ విగ్రహానికి ఆయన పూలమాల వేసి.. ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రధానిగా రాజీవ్ గాంధీ చేసిన సేవలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. సెక్రటేరియట్ వద్ద రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేశారని గుర్తు చేశారు. సంకుచిత మనస్తత్వం కలిగిన కొందరు.. రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబంతోపాటు కాంగ్రెస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతామని.. అది తమ బాధ్యత అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశ సమగ్రత విషయంలో మేం రాజకీయాలు చేయం.. దేశ భద్రతకు తాము కట్టుబడి పని చేస్తామన్నారు.
ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని ఆయన అభివర్ణించారు. సరళీకృత ఆర్ధిక విధానాలతో బలమైన ఆర్ధిక వ్యవస్థగా దేశాన్ని రాజీవ్ గాంధీ నిలబెట్టారన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడం ద్వారా ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం కల్పించారని వివరించారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో ఆనాటి ప్రధాని ఇందిరమ్మ స్ఫూర్తిని దేశంలో ప్రతీ ఒక్కరు ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకున్నారన్నారు. తీవ్రవాదుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పారని ఆయన సోదాహరణగా వివరించారు.
తమ దేశాన్ని తామే రక్షించుకోగలుగుతామని.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరమ్మ ఆనాడే స్పష్టం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం పహల్గామ్ ఘటనలో పాకిస్థాన్‌కు బుద్ది చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారన్నారు. అమెరికా దేశాధ్యక్షుడు ట్రంప్ చెబితే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
TDP MLA: ప్రాణాలకు తెగించి పోరాడిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్ సభ్యుడికి గాయాలు
Etela Rajender: కాళేశ్వరం విచారణకు హాజరువుతా
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం
Road Accident: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్..
For Telangana News And Telugu News