Share News

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం

ABN , Publish Date - May 21 , 2025 | 10:07 AM

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. ఫ్రాంక్ ఫర్డ్ బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించి అప్రమత్తమయ్యారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం

హైదరాబాద్, మే 21: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో లుఫ్తాన్సా విమానానికి తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం ఫ్రాంక్‌ఫర్డ్ బయలుదేరిన విమానం రన్ వే మీదకు వెళ్లిన వెంటనే ముందు టైరులో సమస్య ఏర్పడింది. ఈ విషయాన్ని పైలట్ వెంటనే గుర్తించారు. దీంతో ఈ విషయాన్ని ఎయిర్ పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. అనంతరం వారి సూచన మేరకు విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోకి మళ్లించారు. ఈ సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం టైర్‌ను ఎయిర్ పోర్టులోని సాంకేతిక సిబ్బంది పరిశీలిస్తున్నారు. మరోవైపు కొన్ని గంటల ఆలస్యంగా ఈ విమానం బయలుదేరుతోందని ఎయిర్‌పోర్ట్ అధికారులు వెల్లడించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన.. ఇంతకీ గోల్డెన్ డోమ్ అంటే..స

Israel Bombing: గాజాలో మృత్యుముఖాన 14వేల చిన్నారులు

Medical Education: అనధికార వైద్య కాలేజీల్లో చేరొద్దు: ఎన్‌ఎంసీ

For Telangana News And Telugu News

Updated Date - May 21 , 2025 | 10:23 AM