Share News

TDP MLA: ప్రాణాలకు తెగించి పోరాడిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి

ABN , Publish Date - May 21 , 2025 | 12:35 PM

TDP MLA: వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి పోరాటం చేసిందని టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు.

TDP MLA: ప్రాణాలకు తెగించి పోరాడిన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి
TDP MLA KotamReddy SriDhar Reddy

నెల్లూరు, మే 21: ఆంధ్రప్రదేశ్‌‌లో గత ప్రభుత్వ హయాంలో అన్యాయాలు, అకృత్యాలు ఎంతగా సాగాయో చూశామని.. అటువంటి క్లిష్ట సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కీలక భూమిక పోషించిందని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ప్రాణాలకి తెగించి మరి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రజల కోసం నిలుచుందన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి తప్పు చేయదని.. ఎవరు తప్పు చేసినా వారి తాట తీయడం ఈ సంస్థ నైజమని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు.


Andhra-Jyothi-ED-Vemuri-8.jpg

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సౌత్ మోపూరు గ్రామంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా..’ విజయోత్సవ సభను బుధవారం నిర్వహించారు. ఈ సభకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్యతోపాటు టీడీపీ సీనియర్ నేత గిరిధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. మారుమూల గ్రామమైన సౌత్ మోపూరుకి ఆంధ్రజ్యోతి ఈడీ ఆదిత్య రావడం సంతోషంగా ఉందన్నారు. నలభై రోజుల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పాం.. చెప్పినట్లుగా రూ.1.22 కోట్లతో అభివృద్ది పనులు చేశామని ఆయన తెలిపారు. ఆదిత్య, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సాక్షిగా మాటిస్తున్నా.. వచ్చే ఏడాదిలోగా మరో రూ‌. కోటి నిధులతో అభివృద్ది పనులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.


ప్రజాసమస్యల పరిష్కారం కోసమే.. అక్షరం అండగా.. పరిష్కారమే అజెండగా.. కార్యక్రమం: ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య

Andhra-Jyothi-ED-Vemuri-Adi.jpg

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండగా.. కార్యక్రమం ప్రజల సమస్యలు తీరడానికి రూపొందించామని ఆంధ్రజ్యోతి ఈడీ వేమూరి ఆదిత్య అన్నారు. పత్రికలు ఈ రోజు సమస్యలని ప్రచురించడంతో సరిపెట్టుకుంటున్నాయని పేర్కొన్నారు. సౌత్ మోపూరులోని గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, అధికారులను వేమూరి ఆదిత్య అభినందించారు. సౌత్ మోపూర్ గ్రామస్తులు స్పందిస్తూ.. గ్రామంలో సమస్యలు తీరాయని చెప్పారు. సమస్యలు తీరడానికి సహకరించిన ఎమ్మెల్యే కోటంరెడ్డితోపాటు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Andhra-Jyothi-ED-Vemuri-14.jpg


తమ గ్రామంలో మెయిన్ రోడ్డు గుంతలమయమై వర్షపు నీరు నిలిచేదన్నారు. దోమల బారిన పడి.. విష జ్వరాలు వచ్చి అయిదుగురు మృతి చెందారని ఈ సందర్భంగా గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ఆ సమస్యను రోడ్డు వేసి తీర్చారని తెలిపారు. అక్షరమే అండగా.. పరిష్కారమే అజెండాగా.. కార్యక్రమానికి తమ గ్రామాన్ని ఎంచుకున్నందుకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డితోపాటు ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

Police Encounter: ఎన్‌కౌంటర్‌లో గ్యాంగస్టర్‌ సభ్యుడికి గాయాలు

Etela Rajender: కాళేశ్వరం విచారణకు హాజరువుతా

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన ప్రమాదం

Road Accident: డీసీఎంను ఢీకొట్టిన కారు.. ముగ్గురు స్పాట్ డెడ్..

Updated Date - May 21 , 2025 | 05:10 PM