ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

TTD Poster Released in Europe: యూరప్‌లో టీటీడీ శ్రీనివాస కల్యాణం పోస్టర్ విడుదల

ABN, Publish Date - Sep 13 , 2025 | 08:36 AM

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో యూరప్‌లోని 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.

TTD Poster Released in Europe

అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) ఆధ్వర్యంలో యూరప్‌లోని (Europe) 16 ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణం జరుగనుంది. ఈ క్రమంలో కార్యక్రమ పోస్టర్‌ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ పోస్టర్ విడుదల కార్యక్రమంలో MSME మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) , AP NRT అధ్యక్షులు డాక్టర్ రవికుమార్ వేమూరి, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచిరాం ప్రసాద్ పాల్గొన్నారు.

వారి వెంట ఎన్ఆర్ఐలు కాట్రగడ్డ కృష్ణప్రసాద్, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి, తిట్టు మద్దిపట్ల, కృష్ణ జావాజి, సూర్య వెలగ, నరేష్ కోనేరు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

యూరప్ మొత్తం కార్యక్రమాలకుగానూ డాక్టర్ చలసాని కిషోర్ బాబు ప్రధాన సమన్వయకర్తగా (All Europe Coordinator) బాధ్యతలు స్వీకరించారు. యునైటెడ్ కింగ్‌డమ్, ఐర్లాండ్ ప్రాంతాల సమన్వయకర్తలుగా కాట్రగడ్డ కృష్ణప్రసాద్, విజయ్‌కుమార్ అడుసుమిల్లి, సురేష్ కోరం, శ్రీను వావిలాల, గోగినేని శ్రీనివాస్ వ్యవహరిస్తున్నారు.

శెంగెన్ ప్రాంత సమన్వయకర్తలుగా నరేష్ కోనేరు, శ్రీకాంత్ కుడితిపూడి, సుమంత్ కొర్రపాటి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడారు. యూరప్‌లో నివసించే తెలుగు ప్రజలకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించేందుకు, సంప్రదాయ సాంస్కృతిక విలువలను చేరవేసేందుకు ఈ కల్యాణాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని శ్రీనివాసుడి అనుగ్రహం పొందాలని కోరారు.

ఈ వార్తలు కూడా చదవండి:

హెచ్-1బీ వీసాపై సర్వే.. 56 శాతం మంది అమెరికన్ల భావన ఇదే..

ఒమాన్‌లో తెలుగు కళా సమితి క్రీడా పోటీలు

Read Latest and NRI News

Updated Date - Sep 13 , 2025 | 08:41 AM