ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pakistan And China: పాక్ విష ప్రచారం.. చైనా వైరల్.. కొట్టిపారేసిన భారత్..

ABN, Publish Date - May 10 , 2025 | 11:43 AM

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్‌తో పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది. ఏం చేయాలో, ఎలా దెబ్బకొట్టాలో తెలీక.. చివరకు తప్పుడు ప్రచారానికి తెర తీస్తోంది. దీనికి తన మిత్ర దేశమైన చైనా సపోర్టు కూడా తీసుకుంది. రెండూ కలిసి భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400 పై తప్పుడు ప్రచారానికి తెగబడ్డాయి..

ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్‌తో పాకిస్తాన్ విలవిలలాడిపోతోంది. ఏం చేయాలో, ఎలా దెబ్బకొట్టాలో తెలీక.. చివరకు తప్పుడు ప్రచారానికి తెర తీస్తోంది. దీనికి తన మిత్ర దేశమైన చైనా సపోర్టు కూడా తీసుకుంది. రెండూ కలిసి భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400 పై తప్పుడు ప్రచారానికి తెగబడ్డాయి.. సోషల్ మీడియా వేదికగా పాకిస్తాన్ పోస్టు చేస్తున్న తప్పుడు ప్రచారాలను చైనా ప్రచారంలోకి తెస్తోంది..


భారత్ దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న పాకిస్తాన్ (Pakistan) .. ఎలాగైనా కసి తీర్చుకోవాలనే అక్కసుతో ఏవేవో కుటిల ప్రయత్నాలు చేస్తోంది. సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడడం, డ్రోన్‌లో దాడులు చేయడం వంటి ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇండియన్ ఆర్మీ వాటిని దీటుగా ఎదుర్కొంటోంది. అయితే ఈ క్రమంలో పాకిస్తాన్ విష ప్రచారానికి సిద్ధమైంది. భారత్ మిలిటరీ స్థావరాలపై దాడి చేశామంటూ ఒకసారి, పాక్‌ సైబర్‌ సైన్యం దాడిలో భారత్‌ పవర్‌గ్రిడ్‌ 70శాతం నిర్వీర్యమైపోయిందని మరోసారి.. ఇలా తప్పుడు వార్తలు పోస్టు చేస్తోంది.


అయితే అ వార్తలన్నీ ఫేక్ న్యూస్ అంటూ భారత పీఐబీ స్పష్టం చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో తాజాగా, భారత గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-400పై దాడి చేశామంటూ మరో వార్తను ప్రచారం చేసింది. భారత శక్తిమంతమైన క్షిపణి రక్షణ వ్యవస్థను పాక్‌కు చెందిన జేఎఫ్‌-17 యుద్ధ విమానంతో కూల్చేశామంటూ పాక్‌ ప్రభుత్వ రంగ మీడియా సంస్థ పేర్కొంది. అయితే ఈ వార్తలను చైనా ప్రభుత్వ రంగానికి చెందిన మీడియా ప్రచారంలోకి తెచ్చింది. అలాగే అజర్‌ బైజన్‌కు చెందిన మరో సంస్థ కూడా ఈ వార్తను వైరల్ చేసింది. ఈ వార్తలపై భారత ఆర్మీ అధికారులు స్పందించారు. పాక్‌ చేస్తున్న ప్రచారం తప్పు అని భారత సైనికాధికారులు తెలియజేశారు.


ఎస్‌-400.. అనేది అత్యాధునిక రక్షణ వ్యవస్థ అని చెప్పొచ్చు. దీని రాడార్‌ రేంజి సుమారు 600 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇందులో మొత్తం మూడు భాగాలు ఉంటాయి. క్షిపణి లాంచర్లు, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్. ఇది విమానాలు, క్రూయిజ్ క్షిపణులతో పాటూ వేగంగా కదిలే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా ఢీకొట్టగలదు. ఈ రక్షణ వ్యవస్థను ప్రపంచంలో ఇప్పటివరకు రష్యా, చైనా, టర్కీలు వినియోగిస్తున్నాయి.


ఇవి కూడా చదవండి

India Pakistan Tensions: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ.. దేశంలో నిత్యావసరాలపై కీలక ప్రకటన

India Pakistan Tension: భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తత వేళ జమ్మూ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్లు

Virat Kohli: సైనికుల సేవలకు హృదయపూర్వక ధన్యవాదాలు..జై జవాన్‌కు జై కోహ్లీ

RSS: దేశ భద్రత విషయంలో ప్రతి భారతీయుడు భాగస్వామ్యం కావాలి: ఆర్ఎస్ఎస్..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 10 , 2025 | 11:47 AM