Yogi Vemana University: విద్యార్థులకు అలర్ట్.. నేడే చివరి అవకాశం
ABN, Publish Date - Dec 20 , 2025 | 08:57 AM
యోగివేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్‌సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
వైవీయూలో పీజీ ప్రవేశాలకు నేడు చివరి అవకాశం
కడప ఎడ్యుకేషన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): యోగివేమన విశ్వవిద్యాలయం (Yogi Vemana University) పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎంకామ్, ఎంఎస్‌సీ) కోర్సుల్లో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మీప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రవేశాల గడువు 12వ తేదీకి ముగిసినప్పటికీ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి 20వ తేదీ పీజీలో ప్రవేశాలు చేసుకునేలా కళాశాలలకు అవకాశాన్ని కల్పించిందని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో విశ్వవిద్యాలయంలోని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రెన్స్ టెస్ట్-2025 రాసి అర్హత సాధించినవారు, రాయని వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక అంశాలపై చర్చ
పోలీసుల కస్డడీకి కీలక మావోయిస్టులు..
Read Latest AP News And Telugu News
Updated Date - Dec 20 , 2025 | 09:01 AM