TDP Leader: పాపం.. ఆ జిల్లా టీడీపీ నేత ఇక లేరు...
ABN, Publish Date - Nov 28 , 2025 | 01:49 PM
రైలు ఢీకొని తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకుడొకరు మృతిచెందిన విషాద సంఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. నర్రావుల బాబు అనే టీడీపీ నాయకుడు నెల్లూరు జిల్లా గూడూరుకు వెళ్లాడు. అక్కడ రైలు పట్టాలు దాడుతుంగా అదే సమయంలో వచ్చిన రైలు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు
- రైలు ఢీకొని టీడీపీ నాయకుడి మృతి
బాలాయపల్లి(చిత్తూరు): రైలు ఢీకొని టీడీపీ నాయకుడు మృతిచెందిన విషాద సంఘటన గురువారం గూడూరు రైల్వేస్టేషన్(Gudur Railway Station) సమీపంలో చోటుచేసుకుంది. రైల్వేజీఆర్ పోలీసుల కథనం మేరకు.. బాలాయపల్లి మండలం వ్యాఖ్యం గ్రామానికి చెందిన నర్రావుల బాబు(49) గురువారం ఉదయం ఇంటి వద్ద నుంచి పనుల నిమిత్తం గూడూరు(Gudur)కు వెళ్లారు. గూడూరులోని రెండో ఫ్లాట్‌ఫాం సమీపంలో రైలు పట్టాలు దాటుతుండగా చెన్నై నుంచి విజయవాడ వైపు వెళుతున్న గుర్తుతెలియని రైలు ఢీకొంది. దీంతో బాబు అక్కడికక్కడే మృతిచెందాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. రైల్వే జీఆర్ పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈయన వ్యాక్యం గ్రామంలో టీడీపీ గ్రామస్థాయి నాయుకుడిగా కొనసాగుతున్నాడు. బాబు మృతి టీడీపీకి తీరని లోటని ఆ పార్టీ మండల అధ్యక్షుడు రాయి సత్యనారాయణ, మాజీ అధ్యక్షుడు రాయి మస్తాన్‌నాయుడులు తెలిపారు. బాబు మృతిచెందడంపై పలువురు టీడీపీ నాయకులు సంతాపం తెలియజేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News
Updated Date - Nov 28 , 2025 | 01:53 PM