Road Accidents: ఘోర రోడ్డుప్రమాదాలు.. ఆరుగురు మృతి..
ABN, Publish Date - May 04 , 2025 | 07:12 AM
Road Accidents in AP: ఒంగోలు సమీపంలోని జాతీయ రహదారిపై మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ప్రకాశం : రోడ్డు ప్రమాదాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవగాహన కల్పిస్తున్న అడ్డూ అదుపులేని వేగంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని మిగులుస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో కుటుంబ సభ్యులు మరణిస్తుండటంతో వారి బాధ వర్ణించలేనిది. తాజాగా ఒంగోలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.
ఒంగోలు సమీపంలో 16వ నెంబర్ జాతీయ రహదారిపై మూడు చోట్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో ఆరుగురు మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కొప్పోలు ప్లైఓవర్ సమీపంలో ముందు వెళ్తున్న కారుని లారీ ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మరణించగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో చోట ట్రాక్టర్, కారు ఢీకొని ముగ్గురు మృతి చెందారు. మరో ప్రాంతంలో అదుపు తప్పి లారీ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందారు.
ఈ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదాలకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వాహనదారులు రోడ్డు నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు సూచిస్తున్నారు. వాహనదారులు బాధ్యతాయుతంగా ఉంటేనే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని పోలీసులు చెబుతున్నారు. అలాగే రోడ్డు భద్రతపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. కాగా వరుసగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుండటంతో ప్రకాశం జిల్లా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Atchannaidu: బెంగళూరులో ఫుల్‌టైం తాడేపల్లిలో పార్ట్‌టైం
Minister TG Bharath: లేపాక్షి భూములకు త్వరలో విముక్తి
YS Sharmila: రాష్ట్రానికి నిధులు కావాలి అప్పు కాదు
For More AP News and Telugu News
Updated Date - May 04 , 2025 | 07:25 AM