Share News

Minister Atchannaidu: బెంగళూరులో ఫుల్‌టైం తాడేపల్లిలో పార్ట్‌టైం

ABN , Publish Date - May 04 , 2025 | 06:00 AM

ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు మద్దతు ధర అందకపోయిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. బెంగళూరులో ఫుల్‌టైమ్, తాడేపల్లిలో పార్ట్‌టైమ్ గడిపే జగన్‌కు రాష్ట్ర పరిస్థితి ఎలా తెలుసుకుంటారని ఆయన ప్రశ్నించారు

Minister Atchannaidu: బెంగళూరులో ఫుల్‌టైం తాడేపల్లిలో పార్ట్‌టైం

  • అలాంటి జగన్‌కు రాష్ట్రం గురించి ఏం తెలుసు

  • ప్రతి పంటకూ మద్దతు ధర: అచ్చెన్నాయుడు

అమరావతి, మే 3(ఆంధ్రజ్యోతి): ‘ఐదేళ్ల వైసీపీ పాలనలో పండించిన పంటలకు మద్దతు ధర కల్పించలేదు. రైతుల కష్టం నుంచి కూడా కమీషన్లు తీసుకున్న నీచ చరిత్ర వైసీపీ నేతలది’ అని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘మిర్చికి ఎంఐపీ(మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ ప్రైస్‌) రూ.11,781 ఉంటే మార్కెట్‌లో రూ.13,300 పలుకుతోంది. వైసీపీ నాయకులు ఎంఐపీ ఇవ్వాలని కోరుతున్నారంటే రైతులను రోడ్డున పడేయాలన్నది వారి కుట్రగా ఉంది. ప్రత్తికి రూ.7,121 ఎంఎస్‌పీ ఉంటే మార్కెట్‌లో రూ.8,000 పలుకుతోంది. జగన్‌ ఏమో ఎంఎ్‌సపీకి కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాడు. టమాటాకు కనీస మద్దతు ధర లేకపోయినప్పటికీ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశంతో ధర తగ్గినప్పుడల్లా రైతు బజార్ల ద్వారా విక్రయించి ఆదుకుంటున్నాం. బెంగళూరులో ఫుల్‌ టైం.. తాడేపల్లిలో పార్ట్‌ టైం గడిపే జగన్‌కు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది’ అని మంత్రి ఎద్దేవా చేశారు.

Updated Date - May 04 , 2025 | 06:00 AM