ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP Kesineni Sivanath: యోగాంధ్రలో ఎన్టీఆర్‌ జిల్లా మరో రికార్డ్ : ఎంపీ‌ కేశినేని శివనాథ్

ABN, Publish Date - Jun 11 , 2025 | 08:37 AM

ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని విజయవాడ ఎంపీ‌ కేశినేని శివనాథ్ ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు.

MP Kesineni Sivanath

విజయవాడ: యోగాంధ్రలో ఎన్టీఆర్‌ జిల్లా మరో రికార్డ్ సృష్టించిందని విజయవాడ ఎంపీ‌ కేశినేని శివనాథ్(చిన్ని) (MP Kesineni Sivanath) ఉద్ఘాటించారు. బరమ్ పార్క్‌లోని బోట్లలో యోగా ద్వారా ప్రపంచ రికార్డ్ సృష్టిస్తున్నామని చెప్పారు. గతంలో డ్రోన్ల ద్వారా ఇదే స్థలంలో ప్రపంచ రికార్డ్ సాధించామని గుర్తుచేశారు. బోట్లు, ఫంట్ల మీద వెయ్యి మందికి పైగా యోగాలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు ఎంపీ‌ కేశినేని శివనాథ్.

మన దేశంలో‌ పుట్టిన యోగాకు మళ్లీ‌ పూర్వ వైభవం వస్తుందని కేశినేని శివనాథ్ అన్నారు. ఇవాళ(బుధవారం) యోగాంధ్రలో భాగంగా బరమ్ పార్కులోని కృష్ణానది నడిబొడ్టున పడవులపై యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమాన్నిఎంపీ‌ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారి ముఖేష్ కుమార్ మీనా, కలెక్టర్ లక్ష్మీ శా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మీడియాతో మాట్లాడారు.

జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా డే సందర్భంగా ఏపీలో‌ నిర్వహించే కార్యక్రమంలో రెండు కోట్ల మంది పాల్గొంటారని కేశినేని శివనాథ్ వెల్లడించారు. విశాఖపట్నంలో ఒకేసారి ఐదు లక్షల మందితో యోగా చేయడం ద్వారా మరో రికార్డ్‌కి సిద్దం అవుతున్నామని అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు యోగాకు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని ఉద్ఘాటించారు. ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేయడం అలవాటుగా చేసుకోవాలని సూచించారు. జీవితంలో యోగా భాగమైతే... ఎల్లప్పుడూ ఆరోగ్యం మీ వెంటే ఉంటుందని చెప్పారు. ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక రికార్డ్ సృష్టించడం ఆనందంగా ఉందని ఎంపీ‌ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

కత్తిని మింగిన పాము.. తర్వాత ఏం జరిగిందంటే..

అంతర్జాతీయ టెర్రరిజానికి తండ్రి పాకిస్థాన్...

For More AP News and Telugu News

Updated Date - Jun 11 , 2025 | 08:46 AM