Animini Ravi Naidu: కార్యకర్తల పోరాటంతో వైసీపీని బంగళాఖాతంలో కలిపాం
ABN, Publish Date - May 27 , 2025 | 07:01 PM
సీఎం చంద్రబాబుకి ఆపదలో ఉన్న కార్యకర్తలకు సాయం చేసి ఆదుకోవడమే తెలుసునని ఏపీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు. కార్యకర్త, నాయకుడికి ఏ కష్టం వచ్చినా భరోసాగా చంద్రబాబు, లోకేష్ నిలిచారని పేర్కొన్నారు.
కడప: గత జగన్ ప్రభుత్వంలో కార్యకర్తలు చాలా ఇబ్బందులకు గురయ్యారని ఏపీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు (Animini Ravi Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు టీడీపీ కార్యకర్తలను దారుణంగా వేధించి చంపేశారని మండిపడ్డారు. కడపలో జరుగుతున్న మహానాడులో పాల్గొని రవినాయుడు ప్రసంగించారు. చాలా మహానాడు కార్యక్రమాల్లో వలంటీర్‌గా తాను పనిచేశానని గుర్తుచేశారు. ఈరోజు మహానాడు వేదికపై నిలబడేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల పోరాటంతో వైసీపీని బంగళాఖాతంలో కలిపామని చెప్పారు. కార్యకర్తలు నడిపే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీనే అని అభివర్ణించారు. టీడీపీ అధికారంలో, ప్రతిపక్షంలో ఉన్నా.. చంద్రబాబు ఎప్పుడు కార్యకర్తల సంక్షేమం కోసమే పనిచేశారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా టీడీపీ కార్యకర్తల బిడ్డలను చదివిస్తూ అండగా నిలబడ్డారని అనిమిని రవినాయుడు పేర్కొన్నారు.
కార్యకర్తలకు భరోసా..
‘చంద్రబాబుకి ఆపదలో ఉన్న కార్యకర్తలకు సాయం చేసి ఆదుకోవడమే తెలుసు. యువనేత నారా లోకేష్ టీడీపీ కోటి సభ్యత్వాలు చేయించారు. యువగళం పాదయాత్రలో లోకేష్ వెంట నేను నడిచాను. కార్యకర్త, నాయకుడికి ఏ కష్టం వచ్చినా భరోసాగా లోకేష్ నిలిచారు. ఏ మీటింగ్‌కి వెళ్లిన ముందుగా కార్యకర్తల సంక్షేమం గురించి లోకేష్ తెలుసుకుంటారు. ఎవరైనా ఆపదలో ఉన్నానని లోకేష్‌కి చెబితే వెంటనే స్పందించి పరిష్కరిస్తున్నారు. 44 ఏళ్లుగా కార్యకర్తలకు చంద్రబాబు ఎప్పుడు అండగా ఉన్నారు. గ్రామస్థాయిలో పనిచేసిన కార్యకర్తకు కూడా టీడీపీలో చంద్రబాబు కీలక పదవులు ఇస్తారు. అలాగే నాకు అవకాశం కల్పించారు. సామాన్య కార్యకర్తనైనా నన్ను నేడు శాప్ ఛైర్మన్‌గా నియమించారు’ అని అనిమిని రవి నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
థియేటర్ల వివాదం.. జనసేన ఆదేశాలు ఇవే
అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్
Read Latest AP News And Telugu News
Updated Date - May 27 , 2025 | 07:06 PM