Minister Nimmala Ramanaidu: జగన్ పాలనలో ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయి
ABN, Publish Date - May 01 , 2025 | 10:57 AM
Nimmala Ramanaidu: మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీలో అన్నిరంగాలు నష్టపోయాయని చెప్పారు. రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.
పశ్చిమగోదావరి: గత ఐదేళ్ల జగన్ అరాచక పాలనలో ఏపీ ఆర్థిక మూలాలు దెబ్బతిన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపణలు చేశారు. ఇవాళ(గురువారం) పాలకొల్లు మండలంలో రూ. 86 లక్షలతో పలు అభివృద్ధి పనులకు, మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపన చేశారు. అలాగే రూ. 14 కోట్లతో జరుగుతున్న దమయపర్తి మురుగు డ్రైన్ పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ... నేడు చంద్రబాబు రైతులకు అవసరమైన పనులకు ప్రాధాన్యం ఇస్తూ, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారని అన్నారు. జగన్ పాలనలో విధ్వంసం నుంచి, నేడు వికాసం వైపు అడుగులు వేసేందుకు కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. చంద్రబాబు అమరావతి రాజధాని సంపద సృష్టి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో అన్ని జలాశయాల్లోనూ వచ్చే జూన్‌కి సరిపడే నీటి నిల్వలు ఉన్నాయని వివరించారు. వేసవిలో తాగు, సాగు నీటి అవసరాలకు ఏ ఇబ్బంది లేదని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
అలాగే పాలకొల్లులో జరిగిన ప్రపంచ కార్మికుల దినోత్సవంలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. మేడే సందర్భంగా స్వర్గీయ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కార్మికులతో కలిసి రిక్షా తొక్కారు. వివిధ కార్మిక సంఘాలతో మమేకమై వారికి సంఘీభావంగా ర్యాలీలో మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
YS Jagan: అమరావతి రీ లాంచ్ పనులు.. వైఎస్ జగన్‌కు ఆహ్వానం
Home Minister Anitha: పవన్ మాటలు చాలా ప్రోత్సాహాన్నిచ్చాయి
CM Chandrababu: నెల్లూరు జిల్లా పర్యటనకు..
పహల్గాం దాడిని ఖండించిన ఐక్యరాజ్య సమితి
ప్రభుత్వ వెంచర్లో కొంటే రిజిస్ట్రేషన్ ఖర్చు తక్కువ
For More AP News and Telugu News
Updated Date - May 01 , 2025 | 11:22 AM