Gun Fire In Manikonda: హైదరాబాద్‌లో కాల్పుల కలకలం... ఏం జరిగిందంటే..
ABN, Publish Date - Nov 04 , 2025 | 08:35 PM
మణికొండ పంచవటి కాలనీలో మంగళవారం తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ ఓ స్థల వివాదంలో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్, నవంబరు4 (ఆంధ్రజ్యోతి): మణికొండ (Manikonda) పంచవటి కాలనీలో ఇవాళ(మంగళవారం) తుపాకీ కాల్పులు (Gun Fire) కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడు ప్రభాకర్ ఓ స్థల వివాదంలో గాల్లోకి కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. మణికొండ పంచవటి కాలనీలో తన స్థలాన్నీ ఖాళీ చేయాలని బాధితులను ప్రభాకర్ బెదిరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో తుపాకీతో గాల్లోకి ప్రభాకర్ మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. బాధితులను స్థలంలో నుంచి బయటకు గెంటేసి గేటుకి ప్రభాకర్ అనుచరులు తాళాలు వేసినట్లు తెలుస్తోంది. అయితే, రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీపై డీసీపీ రియాక్షన్..
ఏం చేస్తారో చేసుకోండి.. సీఐతో వైసీపీ నేత దురుసు ప్రవర్తన
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 05 , 2025 | 02:11 PM