YCP Leaders Police Tension: ఏం చేస్తారో చేసుకోండి.. సీఐతో వైసీపీ నేత దురుసు ప్రవర్తన
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:08 AM
గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు.
కృష్ణాజిల్లా, నవంబర్ 4: జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Former CM YS Jagan Mohan Reddy) పర్యటన ప్రారంభమైంది. ఆటోనగర్ వద్ద జగన్‌కు పెనమలూరు వైసీపీ నాయకత్వం స్వాగతం పలికింది. జగన్‌కు స్వాగతం పలికేందుకు పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో నాయకత్వం నిర్దేశించిన ప్రాంతాలకు వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. అయితే వారంతా హైవే మీదకు రాకుండా వైసీపీ శ్రేణులను రోప్ ద్వారా పోలీసులు నిలువరించారు. ఈ క్రమంలోనే గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. హైవే మీద ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దంటూ వైసీపీ నాయకత్వానికి పమిడిముక్కల సీఐ చిట్టిబాబు సూచించారు.
పోలీసు నిబంధనల ప్రకారం వ్యవహరించాలని పామర్రు మాజీ ఎమ్మెల్యే అనిల్‌కు పోలీసులు విజ్ఞప్తి చేశారు. దీంతో పోలీసులతో మాజీ ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. అనిల్‌కు మద్దతుగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశారు. ఏం చేస్తారో చేసుకోండి హైవే మీద ఉంటామంటూ పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ దురుసుగా మాట్లాడారు. డౌన్ డౌన్ సీఐ అంటూ పార్టీ శ్రేణులతో కలిసి అనిల్ నినాదాలు చేశారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేపట్టారు. వైసీపీ నేతల తీరుతో హైవే మీద రాకపోకలు సాగించేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి.
కాగా.. కృష్ణా జిల్లాలో మొంథా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మాజీ సీఎం పర్యటించనున్నారు. నష్టపోయిన రైతులు పరామర్శించనున్నారు. తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాలకు కాకుండా హైవే వెంబడి ఉన్న గ్రామాల్లోని పంట పొలాలను జగన్ పరిశీలించనున్నారు. ఈ క్రమంలో జగన్ రాక సందర్భంగా పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల్లో స్వాగత బ్యానర్లు ఏర్పాటు చేశారు. కీలక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. నిబంధనల ప్రకారంగానే పర్యటన జరగాలంటూ కృష్ణాజిల్లా పోలీసులు ప్రకటించారు. అయితే జగన్ పర్యటనకు భారీగా రావాలంటూ సోషల్ మీడియా వేదికగా కార్యకర్తలకు పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల వైసీపీ నాయకత్వం పిలుపునిచ్చింది. దీంతో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు.. జగన్ పర్యటన ప్రాంతానికి చేరుకుంటున్న పరిస్థితి.
ఇవి కూడా చదవండి...
ఆ వాహనాల డ్రైవర్ల వేతనాలు చెల్లించాలి
ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Read Latest AP News And Telugu News